OTT Movies: ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది ప్రేక్షకులు థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో విడుదలైన ఎన్నో చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అలా ఇప్పుడు థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఒక నాలుగు చిత్రాలు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటి ? ఏ ప్లాట్ ఫారమ్ వేదికగా ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఈనెల 14 -16 వరకు మూడు రోజుల వ్యవధిలో సుమారుగా నాలుగు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్, ఆయుష్మాన్ ఖురానా , రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన థామా, విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన బైసన్ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఇక పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం..
సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. రాశి కన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తెలుసు కదా. తమన్ సంగీతం అందించగా.. నీరజకోన దర్శకత్వం వహించారు. రొమాంటిక్ తెలుగు భాష చిత్రంగా వచ్చిన ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, వివేక కూచిభోట్ల నిర్మించారు. ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది.
ALSO READ:Deepika Padukone: బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా.. వివక్షపై దీపిక సంచలన కామెంట్స్!
ప్రదీప్ రంగనాథన్ , మమితా బైజు జంటగా రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం డ్యూడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి , శరత్ కుమార్, రోహిణి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల చేశారు. నవంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది.
అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ , నీలం స్టూడియోస్ బ్యానర్లపై సమీర్ నాయక్, దీపక్ సీగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మారి సెల్వరాజు రచించి, దర్శకత్వం వహించారు. కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్ , పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నవంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రానుంది.
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ హారర్ సినిమాగా వచ్చిన చిత్రం థామా. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నవంబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.