
Naveen Chandra (Source: Instragram)
నవీన్ చంద్ర.. తెలుగు, తమిళ్ భాష చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్ చంద్ర.. అందాల రాక్షసి, త్రిపుర వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్నారు.

Naveen Chandra (Source: Instragram)
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2024లో అతి తక్కువ సమయంలోనే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు నవీన్ చంద్ర.

Naveen Chandra (Source: Instragram)
2023లో వచ్చిన మంత్ ఆఫ్ మధు సినిమాలో ఆయన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అమెజాన్ ప్రైమ్, ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.

Naveen Chandra (Source: Instragram)
హీరో గానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇప్పుడు కాస్త ఫ్యామిలీకి సమయానికి కేటాయించినట్లు తెలుస్తోంది.

Naveen Chandra (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా భార్య కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్లారు నవీన్ చంద్ర. బీచ్ లో ఫ్యామిలీతో కలిసి చిల్లవుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

Naveen Chandra (Source: Instragram)
అందులో నవీన్ చంద్ర కొడుకుని చూసి భలే క్యూట్ గా ఉన్నాడే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.