Intinti Ramayanam Today Episode November 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవినీ అన్ని పనికిమాలిన పనిలే చేస్తుంది అని శ్రియ పల్లవి ఇద్దరు కూడా అవని అవమానించేల మాట్లాడుతుంటారు.. అవని వాళ్ల అమ్మ వల్ల మనకు ఒక రూపాయిలు లాభం వచ్చేది ఏమీ లేదు కదా మరి ఇలా చేయడం ఎందుకు అని అంటారు. శ్రియ పల్లవిలు అవనిని తిడుతూ ఉంటే అక్షయ్ అందరికీ క్లాస్ పీకుతాడు.. ఏం తెలుసు అని గురించి మాట్లాడుతున్నారు ఏదో అనుమానం ఉండడం వల్లే మీరు ఇలా మారిపోయారు అని అంటాడు. నా భార్య గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే నేను మర్యాద కూడా ఇవ్వను అని అక్షయ్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు.
అవని కి ఫోన్ చేస్తే అవని లేదండి నేను వచ్చేస్తున్నాను అని అంటుంది. మీనాక్షి ఉన్న రూమ్ లోకి చక్రధర వెళ్తాడు. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు. నా గురించి అందరికీ చెప్పడానికి వచ్చావా అని అంటాడు.. దానికి భయపడి పోయిన మీనాక్షి నేను నా పిల్లల్ని కలవడానికి వచ్చాను నీ గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు అని భయపడుతుంది. నువ్వు బతికుంటే నాకు ఎప్పటికైనా నష్టమే అందుకే నువ్వే లేకుండా పోతే నాకు ఏ సమస్య ఉండదు అని చక్రధర్ అక్కడ ఉన్న దిండును తీసుకొని మీనాక్షిని చంపేందుకు దగ్గరకు వస్తాడు. మీనాక్షి నన్ను చంపొద్దు అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రధర్ని చూసి మీనాక్షి భయపడిపోతూ ఉంటుంది.. నువ్వు నా భార్యవని అందరికీ చెప్పాలని వచ్చావా అని బెదిరిస్తూ ఆమెని చంపబోతాడు. ఆ విషయం చూసిన అవని చక్రధరిపై అక్కడున్న ట్రైని విసిరేసి తల్లిని కాపాడుకుంటుంది. రేయ్ అంటూ కోపంగా లోపలికి వచ్చిన అవని చక్రధర్ ను అక్కడున్న ట్రే తో కొట్టి పక్కకి తోసేస్తుంది.. మా అమ్మని చంపబోతావని సెలెన్స్ స్టాండ్ తీసుకొని కొట్టబోతుంది. మీనాక్షి అవనిని అడ్డుకుంటుంది. అవని ఆగమ్మ అతని నా భర్త నీ కన్న తండ్రి అని చెప్పేస్తుంది. దాంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన తండ్రి చక్రధర్ తెలుసుకొని అవని టెన్షన్ పడుతుంది.
అవునమ్మా నేను చెప్పేది నిజమే ఈ దుర్మార్గుడు మీ కన్న తండ్రి.. వీడంటే అసహ్యం వేసే నేను మీకు చెప్పలేదు.. వీడు ఒక దుర్మార్గుడు కాబట్టే వీడి గురించి మీకు చెప్పాలని అనుకోలేదు అందుకే ఇన్ని రోజులు మీ తండ్రి గురించి మీకు నిజం చెప్పలేదు అని అంటుంది.. ఏంటమ్మా నువ్వు చెప్పేది ఈ దుర్మార్గుడు ఈ నీచుడు మా కన్నతండ్రి ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ అసలు నువ్వు అని అవని అడుగుతుంది. అవునమ్మా ఈ దుర్మార్గుడే మీ నాన్న అని మీనాక్షి అంటుంది. ఆ మాట వినగానే అవని ఫ్యూజులు అవుట్ అయినంత పని అవుతుంది..
నిన్ను చూసి మా అమ్మ భయపడుతుంది అందుకే నాకు అనుమానం వచ్చింది. అందుకే ఇక్కడ ఫోన్ ని పెట్టేసి వెళ్లాను అని అవని మరో బాంబు పేల్చేస్తుంది. నీలాంటి దుర్మార్గుడు మా కన్న తండ్రి అంటే నేను అస్సలు ఊహించలేకపోతున్నాను అని అవని అంటుంది. నువ్వు ఏంటో మా అమ్మని చంప పోతున్నావ్ కదా ఇక్కడ వీడియోలో ఉంది నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే ఈ వీడియోని అందరికీ చూపించి నువ్వేంటో అందరికీ తెలిసేలా చేస్తాను అని అవని చక్రధర్స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. నీ అంతట నువ్వు మా అమ్మ నీ భార్యని అందరి దగ్గర ఒప్పుకుంటే అప్పుడు నిన్ను క్షమించి ఈ వీడియోని తీసేస్తాను అని బెదిరిస్తుంది.
Also Read : మీనా పై సుశీల ప్రశంసలు.. నిజం తెలుసుకున్న సుశీల.. అత్తింట్లో మౌనికకు అవమానం..
అక్కడి నుంచి వాళ్ళ అమ్మని అవని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది..నువ్వేం మాట్లాడినా ఆలోచించి మాట్లాడు మీకు నేను సొంత అక్క లాంటి దాన్ని అని ఆమె అంటుంది. నువ్వు నా తోడు కోడలు కాబట్టి అక్క అని పిలుస్తున్నాను. నీలాంటి చీప్ క్యారెక్టర్ కి.. ఒక అనాధ వైన నువ్వు, ఎవరో తెలియని నీకు నేను చెల్లెలా ఏం మాట్లాడుతున్నావ్..? మీ నాన్న గురించి మీ అమ్మ చెప్పుకోలేదు అంటే నువ్వు అక్రమసంతానమే అయి ఉంటావు అని అన్నగాని అవని నోరు ముయ్యి అని అంటుంది.. మీనాక్షి ఏం మాట్లాడుతున్నావే అని పల్లవి చంప పగలగొడుతుంది. నన్నే కొడతావా చూసారా మావయ్య గారు ఆవిడ ఎవరు మన ఇంటికి సంబంధం లేని ఆవిడ నన్ను కొడుతుంది ఇంటి కోడల్ని కొడుతుంది మీరు మౌనంగా ఉన్నారేంటి అని పల్లవి అడుగుతుంది.. అత్తయ్య గారు కాబట్టి మంచిది అందుకే కేవలం కొట్టి వదిలేసింది అదే మీ అమ్మ లాంటివాళ్ళు అయితే నాలుక చీరేసే వాళ్ళు అని కమల్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో పల్లవికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తారు రాజేశ్వరి చక్రధర్.. ఏం జరుగుతుందో చూడాలి..