SSMB 29 Update: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి, హాలీవుడ్ నటీనటులు సైతం తెలుగు చిత్రాలలో ఆసక్తి కనబరిచేలా చేసిన దర్శకుడు రాజమౌళి (Rajamouli). అద్భుతమైన దర్శక విలువలతో ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్న ఈయన.. తాజాగా మహేష్ బాబు(Maheshbabu)తో ఎస్ఎస్ఎంబి 29(SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 2027 లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
సాధారణంగా జక్కన్న సినిమా వస్తోందంటే చాలు.. ఆ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోకి రావడానికి మినిమం రెండేళ్లు పడుతుందని అందరికీ తెలిసిందే. అన్ని రోజులు ఎదురు చూడలేక ఆయా చిత్రాల హీరోల అభిమానులు అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన మెడలో ఉన్న లాకెట్ ను మాత్రమే రిలీజ్ చేశారు. నవంబర్లో అతిపెద్ద సర్ప్రైజ్ ఉంటుందని చెప్పిన రాజమౌళి.. నవంబర్ 15వ తేదీన హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీ వేదికగా లక్ష మంది ఆధ్వర్యంలో #గ్లోబ్ ట్రోటర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఆ రోజే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రిలీజ్ చేస్తానని రాజమౌళి ప్రకటించగా.. వారం రోజుల ముందుగానే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న వ్యక్తులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందులో హీరోగా మహేష్ బాబు.. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra), మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదట పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అయితే ఈ పోస్టర్ కాపీ అంటూ కొంతమంది ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. కుంభ పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు రాజమౌళి పోస్టర్ తో సహా రివీల్ చేశారు.
also read:Keerthy Suresh: కీర్తి సురేష్ రివాల్వర్ రీటా.. రిలీజ్ డేట్ లాక్!
అయితే ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది . గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే దీన్ని బట్టి చూస్తే రేపు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. సౌత్ లోనే తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. అక్కడే పలు చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలీవుడ్ కి దూరమై హాలీవుడ్లో స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అక్కడే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ.. గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పుడు రాజమౌళి సినిమాకు ఏకంగా 45కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.