Ambati Rambabu: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు రూటు మార్చారా? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి రూటు క్లియర్ చేసుకుంటున్నారా? ఎందుకు కూటమి సర్కార్‌ని ఎత్తేస్తున్నారు? అంబటి మాటలను తిలకించిన వైసీపీ నేతలు ఎందుకు షాకయ్యారు? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రూటు మార్చిన అంబటి రాంబాబు
రాజకీయ నేతల మాటలకు రెండు వైపులా అర్థాలు ఉంటాయి. ఆ మాటలను ఎవరికి నచ్చినట్టు వారు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రస్తుతం వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు ఆ కోవలోకి చెందినవారే. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఆశాకానికి ఎత్తేస్తున్నారు అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. మొన్నటికి మొన్న కూటమిలో పవన్ కల్యాణ్ కలిసి ఉండడంపై నోరు విప్పారు.
ఫ్యామిలీతో తిరుమలకు వెళ్లారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. శ్రీ వెంకటేశ్వస్వామి దర్శనం తర్వాత అన్నప్రసాదం వద్దకు వెళ్లారు. అక్కడ భోజనం చేయాలని అనిపించిం దని చెప్పుకొచ్చారు. బంధువులతో కలిసి అన్నప్రసాదం వద్దకు వెళ్లినట్టు తెలిపారు. అక్కడే భోజనం చేశామని, భోజనం అద్భుతంగా ఉందన్నారు. రుచి కరంగానే కాదు, చాలా శుభ్రంగా ఉందన్నారు.
తిరుమలపై అంబటి ప్రశంసలు
భోజనం చేసిన తర్వాత చాలా తృప్తి పడ్డామని మనసులోని మాట బయటపెట్టారు. అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రోజుకు కనీసం 90 వేల మందికి భోజనం సదుపాయాలు ఏర్పాటు చేస్తారని, అదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆ సంఖ్య పెరుగుతుందని అన్నారు.
స్వామి ఆశీస్సులతో చాలా గొప్పగా జరుగు తుందన్నారు. అవకాశం ఉన్నప్పుడు దర్శనం తర్వాత తృప్తిగా భోజనం చేసి భగవంతుడి ఆశీస్సులు పొందాలని తాను కోరుతున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఓవైపు వైసీపీ అధినేత జగన్, మరోవైపు టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి తిరుమలపై వీలు చిక్కినప్పుడల్లా విషం చిమ్ముతున్నారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
ALSO READ: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
అలాంటిది దేవుడి సన్నిధిలో అంబటి రాంబాబు నిజాలు చెప్పారని అంటున్నారు. అంబటి వ్యాఖ్యలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ నేతలు సైతం దీనిపై మాట్లాడుతున్నారు. తిరుమలపై అబద్దం ప్రచారం చేస్తే కేసులు కడతారని భయంతో ఈ విధంగా చెప్పారని అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై అంబటి ప్రశంసలు కురిపించడంపై వైసీపీలో ఏదో జరుగుతోందని అంటున్నారు.
తిరుమలలో అన్న ప్రసాదం తిని, ఆశ్చర్యపోయిన అంబటి..
గతంలో కంటే, భోజనం అద్భుతంగా ఉందన్న అంబటి..
రుచికరంగానే కాదు, చాలా శుభ్రంగా ఉందన్న అంబటి…తిరుమలలో భోజనశాలలో ఇంత అద్భుతంగా ఎలా చేస్తున్నారో అంటూ, ఆశ్చర్యపోయిన అంబటి..
అందరూ తిరుమల వెళ్ళిన వాళ్ళు, కచ్చిగంగా భోజనం రుచి చూడాలన్న… pic.twitter.com/nklH83jd0D— Swathi Reddy (@Swathireddytdp) November 9, 2025