Illu Illalu Pillalu Today Episode November 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. లంచం తీసుకుంటూ దొరికిపోయింది అని వచ్చిన వార్తల గురించి ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడుతూ నర్మదను అడుగుతారు.. కానీ నర్మద మాత్రం ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా తనలో తానే బాధపడుతూ మౌనంగా ఉండిపోతుంది.. ఎప్పుడూ అందరిమీదకి ఎగిరే నర్మదను శ్రీవల్లి మౌనంగా ఉన్నావేంటి నువ్వు లంచం తీసుకున్నావా? నీ మౌనం వెనుక అర్థం ఏంటి అని అడుగుతుంది. మామయ్య పరువు తీసేలా నువ్వు చేశావు ఆయన వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు.. మొన్న కలెక్టర్ వచ్చినప్పుడు నిన్ను గొప్పగా పొగిడారు ఆరోజు మామయ్యని అందరం ఎక్కించారు.. ఇవాళ మాత్రం ఆయన తల తీసేలా చేశావు అని శ్రీవల్లి మాట్లాడుతుంది. వేదవతి మీ తప్పేమీ లేదు అని నిరూపించుకో నా కోడలు ఏ తప్పు చేయదని నువ్వు నిర్దోషిగా బయటికి రా అని ధైర్యం చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ ఎంతగా ధీరజ్ మౌనంగా ఉండాలని చూసినా కూడా రెచ్చగొడుతుంది. నువ్వు ఏమైనా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మల్ల తిరిగి రాను అని ప్రేమ దీరజ్ అంటుంది.. వీళ్ళిద్దరూ గొడవ పడటం భాగ్యం ఆనందరావు చూస్తారు. వీళ్ళ గొడవ ఎంతవరకు వెళుతుందో చూడాలని మౌనంగా ఉంటారు. ప్రేమ నన్ను అంటే నేను ఊరుకోను మా పుట్టింటికి వెళ్ళిపోతానని కోపంగా వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అని ధీరజ్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు. కానీ ప్రేమ నిజంగానే వాళ్ళ పుట్టింటి లోపలికి వెళ్ళిపోతుంది..
ధీరజ్ కూడా వెనకాలే వెళ్ళిపోతాడు. కానీ ప్రేమ మాత్రం లోపలికి వెళ్లిపోవడంతో ధీరజ్ ఇది అక్కడికి వెళ్లి పోయిందంటే ఏం గొడవలు జరుగుతాయో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. దీన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఫోన్ చేస్తాడు. నువ్వు మీ ఇంటికి వెళ్లడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా రా బయటికి అని ధీరజ్ బ్రతిమలాడుకుంటాడు.. ప్రేమ మాత్రం ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది. మొత్తానికి ధీరజ్ క్షమాపణ చెప్పడంతో ప్రేమ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది.
భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ప్రేమ పావురాలు లాగా ఆడుకుంటున్నారు. ఈ ప్రేమ పుట్టింటికి వెళ్లడం ధీరజ్ ఫోన్ చేస్తే మళ్ళీ రావడం ఇవన్నీ వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు మనమే ఎర్రి మొహాలు లాగా నిద్ర మేలుకొని ఏం జరుగుతుందని చూస్తున్నాము అని భాగ్యం అంటుంది. ఏ మా తన పుట్టింటికి వెళ్ళిన విషయాన్ని రామరాజు తో చెప్పాలనుకున్నారో కానీ మళ్ళీ ప్రేమ తిరిగి రావడంతో వాళ్ళిద్దరూ ఇదంతా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్న ఆటలే మనం వెళ్లి పడుకుందాం పద అనేసి అనుకుంటారు.. ఏం లేవగానే నర్మదా నిర్దోషి అని నిరూపించుకుంటుందా లేదా అని ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
భాగ్యం అక్కడికొచ్చి మీరేం బాధపడకండి తప్పు చేసినప్పుడు కచ్చితంగా శిక్ష పడుతుంది కదా.. మీరు ఏమి టెన్షన్ పడకండి మన అమ్మాయి మంచిదే కానీ అక్కడ లంచం తీసుకుంది అని భాగ్యం అంటుంది. ఆ మాట వినగానే వేదవతి నా కోడలు ఎప్పుడు తప్పు చేయదు నిజాయితీకి మారుపేరు మీరు ఆ మాట అనకండి వదినగారు అని అంటుంది. మన అమ్మాయి మంచిదని మనకు తెలుసు ఆ ఏసీబీ ఆఫీసర్లకు తెలియదు కదా వాళ్ళు ఏమని ఇస్తారో చూడాలి అని భాగ్యం ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అటు బద్రావతి సేన పతి ఇద్దరు కూడా నర్మదా ఈరోజు అరెస్టు అవ్వడం ఖాయమని సంతోష పడుతూ ఉంటారు.
ఏసీబీ ఆఫీసుల ముందు విచారణకు కూర్చున్న నర్మద ను నువ్వు తప్పు చేశావు ఇప్పటికైనా నువ్వు సైలెంట్ గా సంతకం చేసేస్తే మా పని మేము చేసుకుంటామని ఆఫీసర్లు అంటారు. తను బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులు వాటి మీద ఉన్న నోట్లు సరిగ్గా సరిపోయాయి స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది అని ఆఫీసర్లు అంటారు. కానీ నర్మద మాత్రం ఆ స్టేట్మెంటు ఇప్పుడు కాకుండా అంతకుముందు కూడా చూడండి అని అంటుంది. అయితే అంతకు ముందు స్టేట్మెంట్లలో సేనాపతి డబ్బులు పంపించినట్లు ఉండడంతో ఆఫీసర్లు నర్మదకు సారీ చెప్పి అతని అదుపులోకి తీసుకుంటారు.
ఇక నర్మదా నిర్దోషి అని న్యూస్ రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. శ్రీవల్లి మాత్రం షాక్ అవుతుంది. అటు బద్రావతి నర్మదా నిర్దోషిని ఎలా నిరూపించుకుంటుంది.. నిజానికి ఆ చాన్సే లేదు మనం చేయించమని ఎవరికీ తెలీదు అని సంబరపడిపోతూ ఉంటుంది. రామరాజు కుటుంబం మీద పగ తీర్చుకోడానికి మనకు ఈ రూపంలో అవకాశం దొరికింది అని సేనపతి భద్ర ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు..
Also Read: అవనికి తెలిసిపోయిన నిజం.. చక్రధర్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవికి మైండ్ బ్లాక్..
ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి వస్తే తొందరగా నాలుగైదు లక్షలు లాగేసి మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ మనం ఇంట్లోనే సెటిల్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని ఆనందరావు ప్లాన్ చేస్తాడు.. నర్మదా నిర్దోషి అని తెలుసుకొని ఇంట్లోని వాళ్ళందరూ చూశారా నర్మదక్క ఏ తప్పు చేయదు అని సంతోష్ పడుతుంటారు. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో సేనాపతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…