Allu Arha:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎక్కువగా తమ పిల్లలను ఇండస్ట్రీలోకి రాకముందే.. ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తూ వారికంటూ ఒక గుర్తింపును అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న ఈయన.. తన సినిమాలు, వ్యాపారాలలో బిజీగా ఉన్నప్పటికీ.. పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తారనడంలో సందేహం లేదు. అప్పుడప్పుడు తన కూతురికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇకపోతే అల్లు అర్జున్ మాత్రమే కాదు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) కూడా తన పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన కూతురు అల్లు అర్హ (Allu Arha) లోని టాలెంట్ ను బయట పెడుతూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ ఫోటోలలో అల్లు అర్హ టాలెంట్ చూసి తండ్రికి తగ్గ తనయురాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ALSO READ:Shraddha Kapoor: కొత్త అవతారం ఎత్తిన శ్రద్ధా కపూర్.. ఏకంగా హాలీవుడ్లో!
విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి అని తాపత్రయపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు స్నేహ రెడ్డి కూడా తన కూతురికి అన్ని కళలను నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు స్నేహ దగ్గరుండి మరీ తన కూతురుతో మృణ్మయ (కుమ్మరి) పనిలో భాగంగా అందంగా దీపాలను తయారు చేయించింది. అటు తల్లి సమక్షంలో అల్లు అర్హ కూడా చక్కగా దీపాలను తయారు చేసి.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ చిన్నారి టాలెంట్ కి అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. అల్లు అర్హలో ఇంత టాలెంట్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయాన్ని అల్లు స్నేహారెడ్డి తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
అల్లు అర్హ కెరియర్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి రాకముందే పాపులారిటీ అందుకున్న ఈ చిన్నారి.. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించి అల్లు అర్హ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 180 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరో నలుగురు హీరోయిన్స్ ఇందులో భాగమైనట్లు సమాచారం.