Keerthy Suresh: కీర్తి సురేష్ (Keerthy Suresh).. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి సురేష్.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె ‘మహానటి’ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకొని ఆశ్చర్యపరిచింది. తర్వాత వరుస పెట్టి పలువురు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా, చెల్లిగా కూడా నటించి ఆకట్టుకున్న ఈమె.. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ తో ఏడు అడుగులు వేసింది. వివాహం జరిగిన తర్వాత తొలిసారి బాలీవుడ్లో సినిమా చేసిన ఈమె.. అక్కడ మొదటి సినిమాతోనే డిజాస్టర్ ను మూటగట్టుకుంది.
ఇప్పుడు మళ్లీ వరుస చిత్రాలు ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈమె మొన్నా మధ్య హీరో సుహాస్ తో కలిసి ‘ ఉప్పుకప్పురంబు’ సినిమాను డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేసి తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ గా ‘రివాల్వర్ రీటా’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కీర్తి సురేష్. వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. ఇదే రోజున రామ్ పోతినేని , భాగ్యశ్రీ కాంబినేషన్లో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా కూడా రిలీజ్ కాబోతోంది. మరి మహానటి కీర్తి సురేష్ నుండి రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? ఇందులో నటీనటులు ఎవరు? ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
also read:Allu Arha: తండ్రికి తగ్గ తనయా.. తన టాలెంట్ తో అబ్బురపరుస్తున్న అల్లు అర్హ!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 28వ తేదీన ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అటు చిత్ర బృందం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించగా.. ఇదే విషయాన్ని కీర్తి సురేష్ కూడా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా.. అందులో కీర్తి సురేష్ గులాబీ పువ్వు పట్టుకొని నవ్వుతూ నిలబడగా.. చుట్టూ ఉన్న రౌడీలు కోపంగా ఆమెకు గన్ను గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది లేడీ ఓరియంటెడ్ ప్రాధాన్యత ఉన్న స్టోరీ అని తెలుస్తోంది.. ఇందులో కీర్తి సురేష్ లుక్స్ ను బట్టి చూస్తే.. లేడీ డాన్ పాత్ర పోషించనున్నట్లు స్పష్టం అవుతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
రివాల్వర్ రీటా సినిమా విషయానికి వస్తే.. జే.కే.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్, రెడీన్ కింగ్స్ లీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్స్ స్టూడియోస్ , ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం , జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ ఎందుకో సైలెంట్ అయ్యారు. ఇకపోతే ఈ సినిమా ఏపీ , తెలంగాణ థియేటర్ హక్కులను హాస్య మూవీస్ ప్రొడ్యూసర్ రాజేష్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు ప్రకటించారు.