Earthquake In Japan: ఆదివారం జపాన్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది. ఇవాటే ప్రావిన్సు తీరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో సంభవించిన 7వ భూకంపం
ఇక గడిచిన 24 గంటల్లో ఏడవ భూకంపమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక మూడు మీటర్ల ఎత్తువరకు సముద్ర కెరటాలు విరుచుకుపడే అవకాశం ఉందని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. అంతేకాదు ఆ ప్రాంతాల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశముందన్నారు. అయితే మూడు గంటల తర్వాత ఆ హెచ్చరికల్ని ఉపసంహరించుకున్నారు.
Also Read: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్
ఆస్తి-ప్రాణ నష్టం జరగకపోవడంతో.. ఊపిరిపీల్చుకున్న అధికారులు
భూకంప తీవ్రత భారీగా ఉన్నా ఎలాంటి ఆస్తి-ప్రాణ నష్టం వాటిల్లలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక రెండు అణు విద్యుత్తు కర్మాగారాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. పలు బుల్లెట్ రైళ్లు కొంత ఆలస్యంతో నడిచాయి.