Tamilnadu Crime: మహిళతో ప్రేమలో పడింది ఓ తల్లి. తన ఆనందానికి అడ్డు వస్తున్నాడని ఐదు నెలల పసి బిడ్డను హత్య చేసింది. ఈ వ్యవహారం చివరకు పోలీసుల వరకు చేరింది. ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులకు విచారణలో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
తమిళనాడులో దారుణం.. ఐదునెలల బిడ్డను చంపిన తల్లి
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందినవాడు సురేష్. 38 ఏళ్ల సురేశ్ రోజువారీ కార్మికుడు. అతడికి ఆరేళ్ల కింద భారతితో వివాహం జరిగింది. సురేశ్-భారతి దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కూతుళ్లు కాగా, ఐదు నెలల బాబు ఉన్నాడు. ప్రశాంతంగా సాగుతున్న వీరి సంసారంలోకి ఓ మహిళ ఎంటరైంది.
సురేష్-భారతి దంపతుల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఆమె కొంతకాలం తన పుట్టింటికి వెళ్లింది. చివరకు కుటుంబ పెద్దల పంచాయతీతో తిరిగి భర్త వద్దకు వచ్చింది. ఆ తర్వాత కలతలు, గొడవలు, హత్యల వరకు వెళ్లింది. రెండు రోజుల కిందట సురేశ్ ఐదు నెలల బాబు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చిన్నారిని కెలమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు.
భార్య.. మరో మహిళతో సంబంధమే కారణం
బాబుకు పాలు ఇస్తుండగా ఊపిరాడక చనిపోయాడని నమ్మించింది భారతి. నిజమేనని నమ్మేశారు కుటుంబసభ్యులు. సహజ మరణం నమ్మడంతో అంత్యక్రియలు నిర్వహించారు. బాబు మరణం తర్వాత సురేశ్ భార్య ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు మొదలుకావడం గమనించాడు సురేశ్. బాబు చనిపోయాడని విషాదం ఆమెలో కనిపించలేదు. దీంతో సురేశ్‌కు భార్యపై అనుమానం మొదలైంది.
ఏం చెయ్యాలో తెలియక కొద్దిరోజులు సతమతమయ్యాడు. చివరకు భార్య ఫోన్ చెక్ చేశాడు. అందులో భార్య ఫొటోలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. కాసేపు నోటి వెంట మాట రాలేదు. భారతి.. సుమిత్ర అనే మహిళతో ప్రేమలో ఉందని గమనించాడు. వారి మధ్య సంబంధం కొనసాగుతోందని గుర్తించాడు.
ALSO READ: భార్యని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన భర్త
ఈ నేపథ్యంలో ఐదునెలల కొడుకును చంపేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సురేష్ ఫిర్యాదుతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తమదైన శైలిలో సురేశ్ భార్య, అలాగే సుమిత్ర అనే మహిళను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. కన్న కొడుకు తాను చంపినట్టు విచారణలో తేలింది.
దీనివెనుక సుమిత్ర అనే మహిళ కారణంగా ఇదంతా జరిగిందని తేలింది. ఈ కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. మూడో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ జంట కలిసి సమయం గడపలేదని, ఆ కారణంగా హత్య జరిగినట్టు సురేశ్ భార్య చెప్పినట్టు తెలుస్తోంది. సురేశ్ భార్య-సుమిత్ర మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.