Raashi Khanna: హీరోయిన్ రాశి ఖన్నా గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

దశాబ్దం కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు.

మనం సిన్మాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కంటిన్యూగా తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చింది.

హీరోయిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటివరకు 30కి పైగానే సినిమాలు చేసింది.

అందులో 9 తమిళ సినిమాలు, రెండు హిందీ, మాలీవుడ్ సినిమాలు చేసింది.

అయినా సరే ఆమెకి టాలీవుడ్‌పై మక్కువ ఎక్కువ. అందుకే మిగతా భాషల్లో ఆఫర్లు వచ్చినా కాల్షీట్లు కుదరకపోవడంతో వదులుకోవాల్సి వచ్చింది.

వచ్చే ఏడాది నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. అవి బాక్సాఫీసు వద్ద హిట్ కొడితే తనకు తిరుగులేదని భావిస్తోంది.

ఇవి కాకుండా అప్పుడప్పుడు పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్‌గా కొనసాగుతోంది. వాటిలో డ్రెస్, జ్యువెలరీకి బ్రాండ్లు సైతం ఉన్నాయి.

వీలు చిక్కినప్పుడల్లా వాటిని ప్రమోట్ చేస్తూ, అటు అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

బంగారు ఆభరణాలు ధరించి, రెడీ శారీతో మెరిసింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.