
Rakul Preet Singh (Source: Instagram)
Rakul Preet Singh Photos: ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించింది. పెళ్లి తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారవేత్తగా మారింది.

Rakul Preet Singh (Source: Instagram)
మరోవైపు ఆడదడప సినిమాలు చేస్తూ రాణిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది.

Rakul Preet Singh (Source: Instagram)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కరెంట్ తీగ, ధృవ లాంటి చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా మారింది. రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. సమయం దొరికితే చాలు జీమ్‌లో దూరిపోతుంది.

Rakul Preet Singh (Source: Instagram)
కొంతకాలంగా తెలుగు తెరకు దూరమైన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్‌గా ఉంది. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా మారింది.

Rakul Preet Singh (Source: Instagram)
రీసెంట్గా ఆమె చేసిన రన్‌వే 34, థ్యాంక్ గాడ్, డాక్టర్ జి లాంటి సినిమాలు చేసింది. కానీ, అవి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. ప్రస్తుతం తన వ్యాపారం చూసుకుంటూ ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తోంది.

Rakul Preet Singh (Source: Instagram)
మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. స్టైలిష్ వేర్లో ఫోజులు ఇచ్చింది.

Rakul Preet Singh (Source: Instagram)
ప్రస్తతం 'దే దే ప్యార్ దే 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ ఫోటో షూట్లో పాల్గొంది. ట్రెండీ వేర్లో స్టైలిష్‌గా ఫోజులు ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.