E-Paper
Advertisement

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?
Advertisement

చిన్న చిన్న వంట చిట్కాలు ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అంతేకాదు అదే ఆహారాన్ని ఆరోగ్యంగా మార్చేందుకు కూడా ఉపయోగపడతాయి. చికెన్, చేపలు, మటన్ వంటివి వండినప్పుడు ముందుగానే వాటిని ఒక గిన్నెలో వేసి పసుపు, నిమ్మకాయ రసం, పెరుగు వంటివి వేసి మ్యారినేట్ చేస్తారు. నిమ్మకాయ లేదా పెరుగు ఈ రెండింటినీ మ్యారినేట్ చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?

ఇలా శుభ్రం చేయండి
చికెన్ లేదా మటన్ వంటి మాంసాన్ని శుభ్రం చేసేందుకు వైట్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ముందుగా వాటిని వెనిగర్ నీటిలో ఐదు నుండి పది నిమిషాలు నానబెట్టాలి. ఇందుకోసం ఒక పాత్రలో నీరు వేసి అందులో మాంసం మునిగేటట్టు వేయాలి. తర్వాత ఒక చిన్న కప్పుతో వైట్ వెనిగర్ ను వేయాలి. ఇలా బయట వెనిగర్ వేసిన నీటిలో మాంసాన్ని శుభ్రం చేయడం వల్ల దానిపై ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. మాంసాహారంపైనున్న కలుషితాలు పోతాయి. ఈ చిట్కా కూడా చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ మరింత టేస్ట్ గా వచ్చేందుకు ఉపయోగపడుతుంది.

Advertisement

మ్యారినేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది?
చికెన్ మటన్ చేపలు వంటి వాటిని నిమ్మకాయ, పెరుగులో మొదటగా మ్యారినేట్ చేస్తారు. కొంతమంది నిమ్మకాయ మాత్రమే ఇస్తారు. మరికొందరు వైట్ వెనిగర్ వేస్తారు. ఇంకొందరు పెరుగు కూడా వేస్తారు. సాధారణంగా తెలుగు ఇళ్లల్లో వాడేది మాత్రం నిమ్మకాయ రసం లేదా పెరుగు. ఇవి ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటాయి. పులుపు రుచి కూడా అధికం. వీటిని మాంసానికి పట్టించడం వల్ల పులుపు రుచి, ఆమ్ల లక్షణాల వల్ల మాంసంలోని ప్రోటీన్లు విచ్ఛిన్నం చేస్తాయి. దీని వల్ల చికెన్, మటన్ వంటివి వండుతున్నప్పుడు మసాలాల రుచిని మరింత సులభంగా గ్రహిస్తాయి. అప్పుడు మాంసం మృదువుగా కూడా ఉడుకుతుంది. ప్రోటీన్లు అప్పటికే విచ్ఛిన్నమై ఉంటాయి కాబట్టి త్వరగా కూడా ఉడికిపోతుంది. జ్యూసీగా రుచిగా వస్తుంది.

వీటిలో ఎన్నో ఉపయోగాలు
చికెన్, మటన్ వంటి మాంసాలను వండడానికి ముందు మీరు మ్యారినేట్ చేయకపోతే మీరు వేసిన మసాలాలు ఆ ముక్కలకు త్వరగా పట్టవు. ఉప్పు కూడా సరిగా ముక్కలకు పట్టదు. దీనివల్ల కర్రీ రుచిగా అనిపించదు. కాబట్టి మాంసాహారాన్ని వండే ముందు కచ్చితంగా నిమ్మకాయ, పెరుగు లేదా వైట్ వెనిగర్ వేసి మ్యారినేట్ చేసేందుకు ప్రయత్నించండి. నిజానికి నిమ్మకాయ రసం, పెరుగు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి నో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో కూడా మన పొట్టకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రెండూ కూడా అన్ని విధాలా మేలే చేస్తాయి. కాబట్టి చికెన్, మటన్ వండే ముందు కచ్చితంగా నిమ్మరసం లేదా పెరుగు వేసి మ్యారినేట్ చేయండి. వీలైతే రెండూ వేయండి. దీనివల్ల కర్రీ కూడా మరింత టేస్టీగా వస్తుంది.

Related News

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

రోజంతా ఇంట్లో తాజా సువాసన.. మాపింగ్ చేసేటప్పుడు నీళ్లలో కేవలం ఇది కలపండి

మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

Big Stories

Advertisement
×