Sankranthiki Vastunnam: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”(Sankranthiki Vastunnam). ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, (Aishwarya Rajesh)మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని హిందీ రీమేక్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గారు నిలిచిన ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 (IFFI 2025)లో భాగంగా ఈ సినిమా ఇండియన్ ఫీచర్ ఫిలింగా(Indian Feature Film) పురస్కారాన్ని అందుకోబోతోంది. ఇలా ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ విధమైనటువంటి అవార్డును అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణం అని చెప్పాలి.
ఇక ఈ విషయాన్ని స్వయంగా ఎస్విసీ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా 2026 ఆస్కార్ రేసులో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇలాంటి పురస్కారాలు లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు వెంకటేష్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ సైతం కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.
#SankranthikiVasthunam has been officially selected for the Indian Panorama (Feature Films) at the International Film Festival of India (IFFI) 2025 ❤️🔥❤️🔥❤️🔥
Another remarkable milestone for a film that set a new benchmark for regional films in TFI 💥
An @AnilRavipudi film 🔥… pic.twitter.com/eMP57q7Zw9
— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2025
ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో క్యామియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో ఇదివరకు ఎఫ్ 1, ఎఫ్2 సినిమాలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.
Also Read: Deepthi Manne: పెళ్లి పీటలు ఎక్కిన జగదాత్రి సీరియల్ నటి.. ఫోటోలు వైరల్!