Deepthi Manne: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు కూడా వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి శుభవార్తలను అభిమానులతో పంచుకుంటున్నారు.. ముఖ్యంగా ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటి నటులు కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ లో జగదాత్రి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న నటి దీప్తిమన్నె(Deepthi Manne) ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.
గత మూడు రోజులుగా దీప్తి ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు దీప్తి రోహన్ రెడ్డి(Rohan Reddy)తో కలిసి ఏడడుగులు నడిచారు. తాజాగా వీరు పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సీరియల్ కి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.
దీప్తి గత కొంతకాలంగా రోహన్ రెడ్డి అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగిందని స్పష్టం అవుతుంది. ఇక దీప్తి విషయానికి వస్తే ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. కన్నడ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న దీప్తి అనంతరం తెలుగులో రాధమ్మ కూతురు, జగదాత్రి, పద్మావతి వంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈమె సీరియల్స్ మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటించారు. ఈమె తెలుగులో సెలవ్ అనే సినిమాలో కూడా నటించారు.
నాకోసమే పంపించాడు…
ఈమె తన ప్రియుడిని పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు నేను ఇంతకాలం ఎదురుచూస్తున్న వ్యక్తివి నువ్వే నా కోసమే దేవుడు నిన్ను పంపించారు. నీ జీవిత భాగస్వామిగా నన్ను ఎంపిక చేసుకున్నందుకు థాంక్యూ సో మచ్ అంటూ తన ప్రేమను వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. తన ప్రియుడిని పరిచయం చేసినప్పటి నుంచి తరచూ తనతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు ఇక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read: Actress Khushbu: హీరోయిన్ పై బాడీ షేమింగ్.. మీడియా పై కుష్బూ ఫైర్ .. విలువలు కోల్పోయారంటూ!