BigTV English
Advertisement

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Phone Fake charger| మీ ఫోన్ ఛార్జర్ మీకు హాని చేయవచ్చు. సరైన ఫోన్ ఛార్జర్ లేకపోతే ఫోన్లు పేలిపోవడం లేదా త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ ప్రమాదాల గురించి ఇటీవలే భారత ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది. కొత్తగా ఒక కన్స్యూమర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో సబ్‌స్టాండర్డ్ (తక్కువ క్వాలిటీ) ఛార్జర్లు ప్రమాదకరమని హెచ్చరించింది. అందుకే ఫోన్ ఛార్జర్ కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా ఆ ఛార్జర్ క్వాలిటీ కోసం సేఫ్టీ మార్క్ ను ముందుగా చూసుకోవాలి.


భద్రతా మార్క్ తప్పనిసరి

ఛార్జర్ కొనేటప్పుడు CRS మార్క్ ఉందా లేదా అని ముందుగా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ప్రొడక్ట్ భద్రతా స్టాండర్డ్స్‌ను కలిగి ఉందని చూపిస్తుంది. భారత ప్రభుత్వం కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఫేక్ ప్రొడక్ట్స్‌ అంటే నకిలీ ఛార్జర్ల భద్రతా సర్టిఫికేషన్ మార్క్ ఉండదు. ఈ మార్క్ లేని ఛార్జర్లు ఉపయోస్తే ప్రమాదకరం.

ఫేక్ ఛార్జర్ల ప్రమాదాలు

సబ్‌స్టాండర్డ్ ఛార్జర్లు త్వరగా వేడెక్కిపోతాయి. ఆ తరువాత ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌ జరిగి తీవ్ర అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఫాల్టీ ఛార్జర్ మీ ఫోన్‌ను త్వరగా డ్యామేజ్ చేస్తుంది. మీ కుటుంబ భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుంది.


ఫేక్ ఛార్జర్లను ఎలా గుర్తించాలి

ఛార్జర్ బరువును ముందుగా గుర్తు పట్టాలి. నకిలీ ఛార్జర్ అసలు ఛార్జర్ కంటే తేలికగా ఉంటుంది. అలా ఉంటే అందులో క్వాలిటీ ఉండదు. ఆ వెంటనే ఛార్జర్ పై CRS మార్క్ చూడండి. జాగ్రత్తగా ఛార్జర్ అంతా పరీక్షించండి. డివైస్‌పై ప్రింటింగ్ క్వాలిటీ చూడండి. అసలు ఛార్జర్‌తో పోల్చండి. ఫేక్ కేబుల్స్ కూడా తక్కువ బరువు ఉంటాయి. ఈ తేడాలు కనిపిస్తే పోలీసులకు, అధికారులకు రిపోర్ట్ చేయండి.

ఫోన్‌ డ్యామేజ్

ఫేక్ ఛార్జర్లు మీ ఫోన్ బ్యాటరీని త్వరగా పాడుచేస్తాయి. ఛార్జింగ్ స్పీడ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. ఛార్జింగ్ టైమ్ కూడా చాలా ఎక్కువ. డివైజ్ మదర్‌బోర్డ్ డ్యామేజ్ అవుతుంది. రిపేర్ ఖర్చు ఎక్కువ అవుతుంది.

పెర్ఫార్మెన్స్ సమస్యలు

డివైస్ నెమ్మదిగా రన్ అవుతుంది. యాప్స్ లోడ్ అవడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఛార్జింగ్ సమయంలో ఫోన్ ఎక్కువ వేడెక్కుతుంది. సిస్టమ్ తరచూ క్రాష్ అవుతుంది. ఫేక్ ఛార్జర్ ఉపయోగిస్తే ఫోన్ పెర్ఫార్మెన్స్ పూర్తిగా పాడవుతుంది.

ఛార్జర్ కొనుగోలు కోసం టిప్స్

ఛార్జర్లు కొనేటప్పుడు అధికారిక వెండర్లు అంటే బ్రాండెట్ అవుట్ లెట్స్ లేదా అధికారిక వెబ్ సైట్స్ నుంచి మాత్రమే కొనండి. ప్యాకేజీపై వెరిఫై చేసే ఫీచర్లు చూడండి. మీ అసలు ఛార్జర్‌.. మీ ఫోన్ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ప్రమాదాలను కూడా నివారిస్తుంది.

Also Read: జేబులో సరిపోయే ఫొటో ప్రింటర్.. షావోమీ కొత్త గాడ్జెట్ గురించి తెలుసా

 

Related News

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

×