SreeLeela (Source: Instagram)
కన్నడ సినీ పరిశ్రమ నుంచి టాలీవుడ్ కి పరిచయమైన ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీ లీల వరుస పెట్టి సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.
SreeLeela (Source: Instagram)
తెలుగులో ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డు సృష్టించిన ఈమె.. కథల ఎంపిక విషయంలో తొందర పడడంతో కొన్ని సినిమాల నుండి తప్పించారు అని సమాచారం.
SreeLeela (Source: Instagram)
ఇక ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్న శ్రీ లీల.. ధమాకా కాంబోతో మళ్లీ రిపీట్ కాబోతోంది. అలా రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న మాస్ జాతర సినిమాలో నటిస్తోంది.
SreeLeela (Source: Instagram)
అలాగే బాలీవుడ్ లో కూడా రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె తాజాగా వింటేజ్ లుక్కులో దర్శనమిచ్చింది.
SreeLeela (Source: Instagram)
బ్లాక్ కలర్ సారీ ధరించి.. దానికి కాంబినేషన్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంటున్న ఈమె.. జుట్టును వదిలేసి కళ్ళకు కాటుకతో అమాయకంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
SreeLeela (Source: Instagram)
తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.