Prabhas: ఒక సినిమా కోసం ఐదు సంవత్సరాలు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఒకవేళ సినిమా ఏమైనా తేడా కొడితే కెరియర్ అలాగా ఆగిపోతుంది. కానీ ప్రభాస్ రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో బాహుబలి సినిమాను విపరీతంగా నమ్మి టైం కేటాయించాడు. ఐదు సంవత్సరాలపాటు ఆ ప్రాజెక్టు తప్ప ఇంకో ప్రాజెక్టు వైపు తన చూపు తిప్పలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. బాహుబలి సినిమా తర్వాతే తెలుగు సినిమాకి ఒక గౌరవం వచ్చింది. తరువాత చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యాయి. ఇప్పుడు తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు అంటే దానికి కారణం బాహుబలి సినిమా. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి.
ప్రతి హీరో బర్తడే కి కొన్ని అప్డేట్స్ రానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చాలా అప్డేట్స్ రానున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సబ్ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ విడుదల కానుంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. టైటిల్ గురించి కన్ఫర్మేషన్ కూడా ఆ రోజే రానున్నట్లు డైరెక్టర్ అనౌన్స్ చేశాడు.కల్కి సినిమా టీం స్పెషల్ బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేయబోతున్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ సినిమా షూటింగ్ అప్డేట్ పోస్టర్ కూడా విడుదల కానుంది. అలానే ఒక స్పెషల్ వీడియో వస్తుంది అని సమాచారం వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఆర్య సినిమాతో సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాను అప్పట్లో ప్రభాస్ హీరోగా చేద్దామని సుకుమార్ ప్లాన్ చేశారు.
అయితే ఆ తర్వాత కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు సుకుమార్. కానీ అది జరగలేదు. దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ హీరోగా సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించిన అనౌన్స్మెంట్ కూడా ఆరోజు విడుదల కానుంది.
Also Read: Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?