Shruti Haasan (Source: Instragram)
లోకనాయకుడు కమలహాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్.. ఆ తర్వాత సింగర్ గా సత్తా చాటింది. హీరోయిన్గా అవకాశాలు అందుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది.
Shruti Haasan (Source: Instragram)
అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న ఈమె.. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.
Shruti Haasan (Source: Instragram)
ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన శృతిహాసన్ రీసెంట్ గా రజనీకాంత్ కూలీ సినిమాలో నటించి హిట్ అందుకుంది.
Shruti Haasan (Source: Instragram)
అందులో భాగంగానే కూలీ సినిమా సెట్ లో వీరు ఎంజాయ్ చేసిన విషయాలను ఫోటోలు రూపంలో తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది శృతిహాసన్.
Shruti Haasan (Source: Instragram)
ప్రీతిస్ డైరీ అంటూ సినిమా షూటింగ్ సెట్లో సౌబిన్ షాహిర్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజు, హీరో ఉపేంద్ర వంటి వారితో ఫోటోలు దిగి వాటిని షేర్ చేసింది.
Shruti Haasan (Source: Instragram)
అంతేకాదు సెట్ లో చిన్న కుక్కపిల్లతో ఆడుకున్న వీడియోని కూడా ఆమె పంచుకుంది. ఇవన్నీ మరపురాని సన్నివేశాలు అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.