BigTV English

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!
Advertisement

Raviteja -Sreeleela: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)త్వరలోనే మాస్ జాతర(Ravi Teja) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రవితేజ డైరెక్టర్ భాను భోగవరపు(Bhanu Bhogavarapu) ఇద్దరు కలిసి వెంకి అట్లూరితో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా నటి శ్రీ లీల(Sreeleela) నటించిన సంగతి తెలిసిందే. ఇదివరకే రవితేజ శ్రీ లీల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా(Dhamakha) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.


ధమాకాతో హిట్ కొట్టిన జోడి..

ఈ సినిమా తర్వాత రవితేజకు కూడా సరైన స్థాయిలో హిట్ సినిమాలు పడలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరి కాంబోలో మాస్ జాతర (Mass Jathara)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి అలాగే ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ పెద్ద ఎత్తున అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీ లీల యాక్టింగ్ గురించి ప్రస్తావనకు రావడంతో రవితేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శ్రీ లీల చాలా అద్భుతంగా నటిస్తుందని , ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తుందని తెలిపారు.

ప్రాపర్ టాలెంట్ బయటపడలేదు..

శ్రీ లీలలో చాలా మంచి టాలెంట్ ఉంది అయితే ఆమె ఆ ప్రాపర్ టాలెంట్ ఇంకా బయట పెట్టలేదని రవితేజ తెలియజేశారు. ఇక డాన్స్ విషయంలో శ్రీ లీల గురించి చెప్పాల్సిన పనిలేదని అద్భుతంగా నటిస్తారని అలాగే మంచి హ్యుమానిటీ ఉన్న అమ్మాయి అంటూ శ్రీ లీల గురించి రవితేజ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీలీలకు తెలుగులో ధమాకా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే.


మాస్ జాతర పైనే ఆశలు..

ఈ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినా అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక మాస్ జాతర పైన శ్రీ లీల కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఈమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించగా, రవితేజ ఈ సినిమాలో రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇదివరకే వెల్లడించారు. ఈ సినిమాలో రవితేజ అభిమానులకు కావలసిన ఎంటర్టైన్మెంట్, ఫన్, యాక్షన్ ఉంటుంది అంటూ డైరెక్టర్ భాను భోగవరపు ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాపై మంచి అంచనాలని పెంచేశారు.. మరి అక్టోబర్ 31వ తేదీ రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Related News

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Big Stories

×