BigTV English

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?
Advertisement

Akhanda 2 : కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ చేయగానే ఒక రకమైన హైప్ క్రియేట్ అవుతుంది. వీటిలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బోయపాటి శీను. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. అయితే బోయపాటి శ్రీను ఎన్ని సినిమాలు చేసినా కూడా బాలకృష్ణ హీరోగా చేసిన సింహా సినిమా చాలా ప్రత్యేకం.


అక్కడితో మొదలైన వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో అఖండ 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. అలానే ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ జియో హాట్ స్టార్ తీసుకుంది. సినిమా విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టినట్లు సమాచారం వినిపిస్తుంది.

జియో హాట్ స్టార్ కండిషన్స్

బోయపాటి శ్రీను సినిమాలు అంటేనే కమర్షియల్ కు కేర్ అఫ్ అడ్రస్ లా అనిపిస్తాయి. యాక్షన్ సినిమాలను బోయపాటి డీల్ చేసినట్లుగా ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ ఎవరు డీల్ చేయలేరని కూడా చెప్పొచ్చు. అయితే అఖండ 2 సినిమాలో 25 నిమిషాల పాటు సాగే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది.


ఈ యాక్షన్ సీక్వెన్స్ చూసిన తర్వాత జియో హాట్స్టార్ టీం దీనిని 20 నిమిషాలకు ట్రిమ్ చేయమని చిత్ర యూనిట్ ను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే బాలకృష్ణ బోయపాటి అంటేనే యాక్షన్ సినిమాలు ఇష్టపడుతుంటారు ఆడియన్స్. అటువంటి యాక్షన్ ను ఓటిపి కోసం ట్రిమ్ చేయమనడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే.

ఇంతలా ఇన్వాల్వ్ అవుతారా?

ఇప్పుడు ఒక సినిమా ఓటీటీ కి అమ్మడం అనేది కూడా ముఖ్యమైన బిజినెస్ గా మారిపోయింది. సినిమా మొదలైనప్పుడే దానికి సంబంధించిన బిజినెస్ లు అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఈ తరుణంలో అఖండ విషయంలో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది.

అయితే మరి సినిమా కంటెంట్ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి 20 నిమిషాలకు ట్రిమ్ చేయమన్నారు అంటే ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ను కూడా ఓటిటి సంస్థలు నిర్ణయించాల్సిన పరిస్థితికి ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసింది. ఈ విషయంలో కూడా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Also Read: Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా?

Related News

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Big Stories

×