E-Paper
Advertisement

OTT Movie : రాక్షసుడికి ఆత్మను అమ్మేసి దెయ్యలతో ఆ పని… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… క్రేజీ హర్రర్ సిరీస్

OTT Movie : రాక్షసుడికి ఆత్మను అమ్మేసి దెయ్యలతో ఆ పని… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… క్రేజీ హర్రర్ సిరీస్
Advertisement

OTT Movie : దెయ్యాల కథలంటే భయపెట్టే సీన్స్ తప్పకుండా ఉంటాయి. వెన్నులో వణుకు పుట్టించే హారర్ సినిమాలు బోలెడు ఉన్నాయి. అలాగే కడుపుబ్బా నవ్వించే దెయ్యాల సినిమాలు కూడా ఉన్నాయి. దెయ్యాలతో నడిచే ఒక ఫాంటసీ వెబ్ సిరీస్, రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ కథ ఒక హోటల్ చుట్టూ తిరుగుతుంది. అందులో కంటికి కనిపించని ఈ దయ్యాలు చేసే హంగామా మామూలుగా ఉండదు. గతంలో వచ్చిన నాలుగు సీజన్ లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన 5వ సీజన్ కూడా అదే బాటలో వెళ్తోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఘోస్ట్స్’ (Ghosts)  2025లో వచ్చిన అమెరికన్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్. దీనికి జో పోర్ట్, జో వైజ్‌మన్ దర్శకత్వం వహించారు. ఇందులో రోజ్, ఉత్కర్ష్ అంబుడ్కర్, ట్రెవర్, రెబెక్కా విసాకీ , బ్రాండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీజన్ 5లో 10 ఎపిసోడ్లతో 2025 ఆక్టోబర్ 16న CBSలో ప్రీమియర్ అయింది. ఇది పారామౌంట్+లో కూడా స్ట్రీమ్ అవుతుంది. IMDbలో దీనికి 7.8/10 రేటింగ్ కూడా ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

సామ్‌ , జే అనే జంట, తమ ఇంటిని హోటల్ గా మార్చి నడుపుతుంటారు.ఈ ఇంట్లో హెటీ, ఐజాక్, పీట్, థోర్ఫిన్, అల్బర్టా, సాసాప్పిస్ అనే ఘోస్ట్‌లు ఉంటాయి. అయితే సామ్ మాత్రమే వాటిని చూడగలదు, మాట్లాడగలదు. మిగతా వాళ్ళకి అవి కనిపించవు. సీజన్ 4 చివరిలో జే తన ఆత్మను డెవిల్ కు ఇచ్చి సామ్‌ ను కాపాడాడు. సీజన్ 5 మొదటి ఎపిసోడ్‌ నుంచే జే తన ఆత్మను తిరిగి పొందడానికి ట్రై చేస్తాడు. ఈ వీఆహాయంలో సామ్, ఘోస్ట్‌లు అతనికి సహాయం చేస్తాయి. ఈ కథ ఫన్నీగా, ఘోస్ట్‌ల గొడవలతో మొదలవుతుంది.

Read Also : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

Advertisement

ఇది ఇలా ఉంటే సామ్, జే హోటల్‌లో కస్టమర్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సన్నివేశాలు కామిడితో కడుపుబ్బా నవ్విస్తాయి. సామ్, ఘోస్ట్‌లు జేను సేవ్ చేయడానికి విచిత్రమైన, ఫన్నీ ప్లాన్స్ వేస్తారు. జే ఆత్మను డెవిల్ నుంచి సేవ్ చేసే ప్రయత్నంలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. చివరికి జే తన ఆత్మను తిరిగి పొందుతాడా ? డెవిల్ ని సామ్‌తో పాటు ఘోస్ట్‌లు ఎలా ఎదుర్కుంటాయి ? హోటల్ బిజినెస్ ఎలా నడుస్తుంది ? ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్టులు ఏమిటి ? అనే విషయాలను, ఈ కామెడీ ఫాంటసీ సిరీస్ ను చూసి తెలులుసుకోవాల్సిందే.

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×