OTT Movie : సరికొత్త లవ్ స్టోరీలతో ఆడియన్స్ కి కొత్త రుచులను చూపిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా ఓటీటీలో కి వచ్చిన ఒక ఫిలిప్పైన్ సినిమా, 1940లో జపాన్ ఆక్రమణ నుండి మొదలై, మోడర్న్ టైమ్ వరకు వెళ్తుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు, లవ్ స్టోరీ, యుద్దాలు ఆడియన్స్ కి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాయి. అయితే ఈ కథలో హీరో చావులేని ఒక వాంపైర్. హీరోయిన్ కి వయసు పెరుగుతుంది. కానీ హీరో మాత్రం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటాడు. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే
‘ది టైమ్ దట్ రిమైన్స్’ (The Time That Remains) అడాల్ఫో అలిక్స్ డైరెక్ట్ చేసిన ఫిలిప్పైన్ రొమాంటిక్ ఫ్యాంటసీ సినిమా. ఇందులో బింగ్ పిమెంటెల్ (లిలియా), కార్లో అక్వినో (మతియాస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 అక్టోబర్ 16 న ఈ సినిమా Netflix లో నేరుగా రిలీజ్ అయింది.
ఫిలిప్పైన్స్‌లో లిలియా అనే 88 ఏళ్ల వృద్ధ మహిళ ఒక పెద్ద మాన్షన్‌లో ఒంటరిగా ఉంటుంది. ఆమె రిచ్, కానీ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. ఒక రాత్రి దొంగలు ఆమె ఇంట్లోకి వచ్చి గన్ తో షూట్ చేస్తారు.ఆ తరువాత లిలియా హాస్పిటల్‌లో కళ్ళు తెరుస్తుంది. తన లవర్ మతియాస్ ను కలవాలని కోరుకుంటుంది. మతియాస్ ఒక వాంపైర్. అతనికి వయసు కూడా పెరగదు. లెక్క ప్రకారం అమరత్వం కలిగి ఉంటాడు. ఇక ఆమె హాస్పిటల్‌లో ఉండగా, సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లతో 1940లకు వెళ్తుంది. ఇక్కడ లిలియా, మతియాస్ లవ్ స్టోరీ మొదలవుతుంది.
1941లో ఫిలిప్పైన్స్‌లో జపాన్ ఆక్రమణ జరుగుతుంటుంది. లిలియాకి అప్పుడు 20 ఏళ్లు ఉంటాయి. ఆమె తన తల్లిదండ్రులతో ఉంటుంది. అయితే జపాన్ సైనికులు దాడి చేయడంతో, వాళ్లు ఒక నిర్మానుష్య ప్రాంతంలో తలదాచుకుంటారు. అక్కడ లిలియా, మతియాస్‌ను మీట్ అవుతుంది. మతియాస్ హ్యాండ్సమ్, సాఫ్ట్‌గా మాట్లాడే మనిషి కావడంతో, తొందర్లోనే వీళ్ళ మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలవుతుంది. వాళ్లు కలిసి అడవుల్లో టైమ్ స్పెండ్ చేస్తారు. లిలియా అతన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక రాత్రి జపాన్ సైనికులు దాడి చేస్తారు. మతియాస్ తన వాంపైర్ పవర్స్ యూజ్ చేసి, లిలియా ఫ్యామిలీని సేవ్ చేస్తాడు. ఇప్పుడు లిలియాకు అతని సీక్రెట్ తెలుస్తుంది.
Read Also : ఏం సినిమా గురూ… ఆ సీన్లే హైలెట్… సింగిల్స్ కు పండగే
అతను రక్తం తాగి జీవించే ఒక అమరుడు. ఈ విషయం తెలిసి లిలియా షాక్ అవుతుంది. కానీ అతన్ని లవ్ చేయడం మానుకోలేక పోతుంది. ఆ తరువాత జపాన్ దాడిలో లిలియా తల్లిదండ్రులు చనిపోతారు. ఆ తరువాత కథలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. చివరికి వీళ్ళ లవ్ స్టోరీ ఏమవుతుంది ? ముసలి వయసులో ఉన్న లిలియాని కలవడానికి మతియాస్ వస్తాడా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.