Suriya 46 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన రవితేజ తర్వాత కాలంలో నటుడుగా మారిపోయాడు. అలానే సూపర్ హిట్ సినిమాలు చేస్తూ టాప్ హీరో అయిపోయాడు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణంలోనే పూరి జగన్నాథ్ తనను చూసి నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని అంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ విషయాన్ని రవితేజ పెద్దగా పట్టించుకోలేదు.
కానీ పూరి జగన్నాథ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రవితేజ కెరియర్ లో అదిరిపోయే సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాడు. ఇక రవితేజ కూడా స్వతహాగా అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం వలన చాలామంది కొత్తదర్శకులను ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. గోపీచంద్ మలినేని, బాబి వంటి టాప్ దర్శకులు ను రవితేజ పరిచయం చేశాడు.
ఇకపోతే రవితేజ తనయుడు మహదన్ ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. మామూలుగా హీరో కొడుకులు హీరోలు అవ్వడం మనం తరచు గమనిస్తూ ఉంటాం. కానీ ఈ జనరేషన్ కంప్లీట్ గా మారిపోయింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ తనయుడు కూడా దర్శకుడుగా మారిపోయి ప్రస్తుతం సందీప్ కిషన్ తో సినిమాను చేస్తున్నాడు.
గతంలో రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి యాక్టింగ్ వైపు అడుగులు వేశారు. ఇప్పుడు రవితేజ తనయుడు కూడా అలానే చేస్తాడేమో అని కొంతమందికి వస్తున్న సందేహం. చాలామంది స్టార్ హీరోల నట వారసుల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సార్ సినిమాతో వెంకీ స్టైల్ కూడా కంప్లీట్ గా మారిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన లక్కీ భాస్కర్ సినిమా బీభత్సమైన సక్సెస్ సాధించింది. తెలుగు లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాకి రావలసిన గుర్తింపు మాత్రం రాలేదు. రెండు వరుస సక్సెస్ఫుల్ సినిమాలు తర్వాత సూర్యతో డైరెక్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అది ఎంతవరకు రీచ్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: Bigg Boss 9 promo : భరణి నామినేషన్, ఇమ్ము నమ్మించి మోసం చేశాడా?