Firecracker Blast: దీపావళి పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిల్వ ఉంచిన క్రాకర్స్ పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సమీపంలోని తిరువళ్లూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంట్లో క్రాకర్స్ నిల్వ ఉంచినట్లు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో టపాసులు విక్రయించి.. నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అవి ఒక్కసారిగా పేలడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యింది. స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. కొద్ది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో క్రాకర్స్ నిల్వ చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని తేలింది. క్రాకర్స్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులు కూడా ఇంట్లో ఉన్నట్లు విచారణలో బయటపడింది.
Also Read: దీపావళి వేళ మరో తీపి కబురు అందించిన ఏపీ సీఎం చంద్రబాబు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడు కారణంగా దెబ్బతిన్న ఇళ్లను, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. క్రాకర్స్ సరఫరా చేసిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తెలిపారు.