Nizamabad News: నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో రౌడీ షీటర్ రియాజ్‌పై ఎన్‌కౌంటర్ జరిగిందనే వార్తలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సాయి చైతన్య తాజాగా స్పందించారు. రియాజ్ ఎన్ కౌంటర్ చేసినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.
వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో.. పోలీసులు విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో రియాజ్ సారంగపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులకు చిక్కినట్లు. తప్పించుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్ జరిగి అతను హతమయ్యాడనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతం వైరల్ అయ్యాయి.
ALSO READ: AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు
అయితే.. ఈ వార్తలపై సీపీ సాయి చైతన్య మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ‘నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరుపలేదు. ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నాం’ అని సీపీ వెల్లడించారు. తాము అదుపులోకి తీసుకోవడానికి ముందే రియాజ్ ఒక వ్యక్తితో గొడవ పడ్డాడని.. ఆ గొడవలో రియాజ్‌కు గాయాలు అయ్యాయని ఆయన వివరించారు. ప్రస్తుతం రియాజ్‌కు చికిత్స అందిస్తున్నట్లు సీపీ తెలిపారు.
https://twitter.com/bigtvtelugu/status/1979896364810346697
కానిస్టేబుల్ హత్య తర్వాత పరారీలో ఉన్న రియాజ్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఎట్టకేలకు అతన్ని పట్టుకోవడంతో పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది. నిందితుడిని ప్రశ్నించి పూర్తి వివరాలు రాబట్టి పూర్తి విషయాలను వెల్లడించనున్నారు.