E-Paper
Advertisement

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 
Advertisement

Nani Sujeeth : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఒక సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ జి సినిమాతో మంచి సక్సెస్ అందించాడు సుజిత్. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన సుజిత్ రన్ రాజా రన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. డైరెక్టర్ గా అది మొదటి సినిమా అయినా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి డీల్ చేసినట్టు ఆ ప్రాజెక్టు డీల్ చేసాడు సుజిత్.

 

Advertisement

బాహుబలి వంటి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా సాహో లాంటి సినిమాను తెరకెక్కించాడు. అప్పటికే ఒక సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న సుజిత్ అంత పెద్ద భారీ ప్రాజెక్టు డీల్ చేయటం మామూలు విషయం కాదు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ తెలుగులో సాధించలేకపోయింది. కానీ నార్త్ లో ఆ సినిమా చూసి చాలామంది ఆశ్చర్యపడిపోయారు. సుజిత్ టాలెంట్ ఏంటో అప్పుడే చాలామంది గుర్తించారు.

నాని సరసన పూజా హెగ్డే 

ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో నాని సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఒక స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా. ఇటువంటి సినిమాలను సుజిత్ డీల్ చేయడంలో ఎక్స్పర్ట్ అని ఓ జి సినిమా ప్రూవ్ చేసింది.

Advertisement

నానితో ఇప్పటివరకు పూజ హెగ్డే ఒక సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నాని సరసన పూజా హెగ్డేను సుజిత్ సెట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారకు ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా 

ఎవరికైనా కూడా కొంత టైం నడుస్తుంది. అలా పూజా హెగ్డే టైం కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతకాలం నడిచింది. మహర్షి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చాయి.

కానీ ఒక తరుణంలో పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అవ్వడం మొదలుపెట్టాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా పూజ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు పూజను నాని సినిమా కోసం తీసుకుంటున్నాడు అంటే సుజిత్ పూజ హెగ్డే ఫెయిల్యూర్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడేమో వేచి చూడాలి.

Also Read: Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×