Venkatesh: దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్.. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. చాలా ముఖ్యమైన విషయాల గురించి తప్ప వేరేవాటికి సోషల్ మీడియాను ఉపయోగించడు.
డిసెంబర్ 4 న అక్కినేని వారసుడు నాగ చైతన్య- శోభితాల వివాహం ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్ వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక మొదటి నుంచి వధువు శోభితాను పెళ్లి కూతురు వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి కానీ, చైను వరుడుగా తయారుచేసిన ఫోటోలు బయటకు రాలేదు.
పెళ్లి తరువాత చై పెళ్లి కొడుకు వేడుకకు సంబంధించిన ఫోటోలను అక్కినేని, దగ్గుబాటి కజిన్స్ పంచుకున్నారు. ఈ ఫోటోలలో అక్కినేని హీరోలు సుశాంత్, సుమంత్, నాగార్జున అన్న పిల్లలు, అక్కల పిల్లలు, దగ్గుబాటి వారసులు అందరు ఉన్నారు.
ఇక చై మేనమామ అయిన వెంకటేష్ సైతం కొన్ని అద్భుతమైన ఫొటోస్ ను అభిమానులతో పంచుకున్నాడు. వెంకటేష్ సోదరి లక్ష్మీకి పుట్టిన కొడుకే నాగచైతన్య. చిన్నప్పటి నుంచి చై ఎక్కువ దగ్గుబాటి వారింట్లోనే పెరిగాడు.
చై అంటే వెంకీ మామకు ఎంతో ఇష్టం.. మామఅల్లుళ్ళు కలిసి ఒక సినిమా కూడా తీశారు. చై రెండు పెళ్లిళ్లలో సందడి అంతా వెంకీ మామదే అని చెప్పాలి. సామ్ తో చై పెళ్లప్పుడు దగ్గుబాటి హీరోస్ ఎంత సందడి చేశారో ఇప్పుడు కూడా అంతే సందడిగా కనిపించారు.
చైను వెంకీ మానే దగ్గరుండి పెళ్లి కొడుకును చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. చై- శోభితాలకు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక మేనల్లుడు పెళ్ళికి వెంకీ మామనే స్వయంగా బుగ్గ చుక్క దిద్ది పెళ్లి కొడుకును చేసిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మామఅల్లుళ్లు అంటే ఇలా ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.