BigTV English

Salman Khan: మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏకంగా అక్కడి నుండే..?

Salman Khan: మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏకంగా అక్కడి నుండే..?

Salman Khan:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)మళ్లీ బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆయన షూటింగ్ స్పాట్లో ఒక వింత ఘటన ఎదుర్కొన్నారు. ముంబైలోని జోన్ 5 లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సినిమా నిమిత్తం షూటింగ్ లొకేషన్ లో వుండగా.. బుధవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి లొకేషన్ కి వచ్చాడు. అనంతరం గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ పేరు చెబుతూ బెదిరించడం మొదలుపెట్టారు. దాంతో అతడిని షూటింగ్లో ఉన్న ఇతర సిబ్బంది వెంటనే పట్టుకోవడం జరిగింది. ఇక హుటాహుటిన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, వారు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం.


సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు..

ఇలాంటి డైరెక్ట్ గా షూటింగ్స్ పార్టీకి వచ్చి సల్మాన్ ఖాన్ ను బెదిరించడంతో అతడిని అరెస్టు చేసారు శివాజీ పార్కు పోలీసులు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. సల్మాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి సరాసరి షూటింగ్ స్పాట్లోకి వచ్చి బెదిరించడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు రావడంతో ప్రత్యేక భద్రతను కేటాయించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన నివాసం, గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర హై సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు సొంతంగా ఆయన కొంత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే సల్మాన్ ఖాన్ కి మాత్రం ఇలా బెదిరింపులు వస్తూ ఉండడంతో ఆయన అభిమానులు అప్రమత్తం అవ్వాలి అని కోరుతున్నారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ కి మాత్రం లారెన్స్ బిష్ణోయ్ వర్గం నుండి వరుస బెదిరింపులు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు.


నెలలోపే మూడోసారి బెదిరింపు..

ఇదిలా ఉండగా సరిగ్గా నెల రోజుల క్రితం అనగా నవంబర్ 5వ తేదీన ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై పోలీసులు స్వయంగా వెల్లడించారు. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి కూడా మెసేజ్ వచ్చింది. లారెన్స్ గ్యాంగ్ పేరుతో ఈ బెదిరింపులు వచ్చినట్లు వారు స్పష్టం చేశారు. రూ .5కోట్లు ఇవ్వాలని, లేదా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆ మెసేజ్ లో కోరినట్లు వెల్లడించడం జరిగింది. అయితే ఆ బెదిరింపులు ఆ వారంలో రెండోసారి కావడం గమనార్హం.ముఖ్యంగా తమ దేవాలయానికి వెళ్లి సల్మాన్ ఖాన్ బహిరంగంగా అందరి ముందు క్షమాపణలు చెప్పాలని, లేదా రూ .5కోట్లు ఇవ్వాలని ఆ మెసేజ్ లో ఉంది. అంతేకాదు లారెన్స్ బిష్ణోయ్ సోదరుని మాట్లాడుతున్నానని కూడా ఆ మెసేజ్ లో స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇక తమ డిమాండ్ ను పట్టించుకోకపోతే సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని కూడా నేరుగా దుండగులు వార్నింగ్ ఇవ్వడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. అంతే కాదు తమ గ్యాంగ్ ఇంకా యాక్టివ్ గానే ఉందని చెప్పడం గమనార్హం. ఏదిఏమైనా సల్మాన్ ఖాన్ గతంలో కృష్ణ జింక విషయంలో చేసిన తప్పు దిన దిన గండంగా మారిపోయిందని చెప్పాలి. మరి దీని నుంచి సల్మాన్ ఖాన్ ఎలా బయటపడతారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×