BigTV English

Chiranjeevi: మెగా ఇంట దీపావళి.. ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్..ఫోటోలు వైరల్!

Chiranjeevi: మెగా ఇంట దీపావళి.. ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్..ఫోటోలు వైరల్!
Advertisement

Chiranjeevi: దీపావళి పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున పార్టీలను నిర్వహిస్తూ ఇతర సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే టాలీవుడ్ నిర్మాత పండ్ల గణేష్ ఎంతో ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ అందరు సందడి చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.


మనసు ఆనందంతో నిండిపోయింది..

ఈ వేడుకలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున(Nagarjuna), వెంకటేష్ (Venkatesh) ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంకటేష్ తన భార్యతో కలసి ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇక నాగార్జున అమల దంపతులు కూడా హాజరయ్యారు అలాగే సినీ నటి నయనతార(Nayanatara) కూడా ఈ దివాళి వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి షేర్ చేస్తూ.. “నా ప్రియమైన మిత్రులు నాగార్జున వెంకటేష్ అలాగే నా కోస్టార్ నయనతారతో కలసి మా కుటుంబ సభ్యులు దీపావళి పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రేమ, జ్ఞాపకాలు జీవితాన్ని ఎంతో ప్రకాశవంతంగా మారుస్తాయి. నా హృదయం సంతోషంతో నిండిపోయింది” అంటూ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

చిరంజీవి ఇంట్లో మొదటి దీపావళి..

చిరంజీవి ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య దంపతులు మొదటిసారి తన కొడుకుతో కలిసి తొలి దీపావళిని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరుపుకోవటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంభర సినిమా పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఈయన తిరిగి డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయని నవంబర్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోబోతోందని తదుపరి రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

Also Read: Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?

Related News

Govardhan Asrani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్ ఇచ్చిన శ్రీలీల..పవర్ ప్యాకెడ్ అంటూ!

Ajmal Ameer: సె** ఆడియో చాట్ పై స్పందించిన నటుడు.. నన్నేం చేయలేవంటూ కామెంట్స్!

Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?

Mari Selvaraj: నేను నీకు మద్యం ఇవ్వడం లేదు, నా సినిమా అలా చూడకు

Ram Pothineni: అప్పుడు రామ్ చరణ్ ని చూస్తే జాలేసింది.. రామ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan: రామ్ చరణ్ సెంటిమెంట్ మంత్, పెద్ది రిలీజ్ డేట్ కూడా కారణం అదేనా?

Big Stories

×