Ayan Mukerji: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ఈయన తాజాగా యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి వచ్చిన వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)నటించారు. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ (NTR)కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే.
ఇలా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. తద్వారా దర్శకుడు అయాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ లో భాగమైన ధూమ్ 4 (Dhoom 4)నుంచి ఈయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వార్ 2 ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోని నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా అయాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈయన బ్రహ్మాస్త్ర 2 (Brahmastra2)సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తుంది. ఈ సినిమాని 2026 సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో అయాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని ఇదివరకే చిత్ర బృందం ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.
బ్రహ్మాస్త్ర 2 ..
ఇక బ్రహ్మాస్త్ర సినిమాలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , అలియా భట్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున కూడా కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తెలుగులో విడుదలయ్యి ఇక్కడ కూడా ఇంత మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. రామాయణ సినిమా మొదటి భాగం 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోతోంది. ఈ సినిమా అనంతరం రణబీర్ బ్రహ్మాస్త్ర 2 సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇక అలియా భట్ కూడా ప్రస్తుతం పలు సినిమా పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆల్ఫా అనే సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Jayammu Nischayammuraa: ఆ హీరోయిన్ కోసం పడి దొర్లిన జగపతి బాబు.. పరువు మొత్తం తీసిందిగా?