BigTV English

Bigg Boss 9 Promo: విశ్వరూపం చూపించిన తనూజ.. విజిలేసి మరి రమ్య, మాధురికి ఇచ్చిపడేసింది..

Bigg Boss 9 Promo: విశ్వరూపం చూపించిన తనూజ.. విజిలేసి మరి రమ్య, మాధురికి ఇచ్చిపడేసింది..
Advertisement


Bigg Boss 9 Day 43 Promo 3: ఈ వారం నామినేషన్స్ హీట్ ఏ రేంజ్ లో ఉందో ప్రొమోలు చూస్తుంటే అర్థమైపోతుంది. నేటి (సోమవారం) ఎపిసోడ్ రణరంగమే అన్నట్టుగా ఉండబోతుంది. ఒక్కొక్కరి నామినేషన్స్, ఆర్గ్యూ హీల్ నెక్ట్స్ లెవెల్ అనేట్టుగా ఉన్నాయి. ఆయేషా, రీతూని టార్గెట్ చేస్తూ చెలరేగిపోయింది. హే నీ ఓవరాక్షన్ ఆపవే అంటూ రీతూపై నారేసుకుని పడిపోయింది ఆయేషా. సెకండ్ ప్రొమోలో రాము, రీతూల నామినేషన్ ఫుల్ హీటెక్కింది. రెండు ప్రొమోలలోని నామినేషన్స్ వార్ చూస్తుంటే ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూద్దామా ఆసక్తి ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి బిగ్ బాస్ మూడో ప్రొమో వదిలి మరింత క్యూరియాసిటి పెంచాడు.

మీ ఆరుగురి పవర్ తీసేస్తా..

ప్రొమోలో సాయి, కళ్యాణ్ నామినేషన్ తో సాగింది. ఇందులో తన నామినేషన్ పవర్ తీయాలని చూసిన పాయింట్ పై సాయి కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. ఇమ్మునిటీ పవర్ ని మీరు ఎంత తీసేద్దామని అనుకుంటున్నారో, అది ఎంత రైట్ అని భావిస్తున్నారో.. మిమ్మల్ని అన్ సేఫ్ చేశారో అది భరించి ముందుకు వెళ్లడం కూడా తప్పే అని వాదించాడు సాయి. దీనికి కళ్యాణ ఒక గేమ్ ఆడుతుంటే నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసిన వాడు ఔట్ అవ్వడు అంటే నేనుందుకు ఒప్పుకుంటా.. నా గేమ్ ఎవరికీ ఏ అడ్వేంటేజ్ లు ఇవ్వదలుచుకోవడం లేదని, ఆరుగురి పవర్స్ తీసేందుకు తాను రెడీగా ఉన్నానంటూ కళ్యాణ్ ఛాలెంజ్ విసిరాడు.


నీ వల్లె భరణి అన్న ఎలిమినేట్ అయ్యాడు.. సంజన

ఆ తర్వాత సంజన.. దివ్యని నామినేట్ చేసింది. లీడర్ బోర్డులో తను ఫోర్లు ఉన్నకూడా తీసేశావు అంటూ రెండు వారాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ కి ఇప్పుడు నామినేట్ చేసింది. ఇది చూడటానికి సిల్లిగా ఉందంటూ దివ్య వాదించింది. భరణి అన్న బయటకి పోవడానికి ప్రధాన కారణం నువ్వే అంటూ దివ్యపై నిందలు వేసింది. నామినేట్ చేసి ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారంటూ వెంటనే సంజనకు తిప్పి కొట్టింది దివ్య. ఆ తర్వాత తనూజ నామినేషన్ చూపించారు. నిన్న దీపావళి ఎపిసోడ్ లో నాగార్జున చూపించిన వీడియో పాయింట్ తో రమ్యను నామినేట్ చేసింది.

సింగిల్ హ్యాండ్ విజల్ సౌండ్ గట్టిగా వినిపిస్తది..

ఒకరిని బాధ పెట్టాలని, ఇద్దరి మధ్య మంట పెట్టాలనే హౌజ్ కి వచ్చావా.. ఇంకొకరికి చెప్పేముందు, ఒకరి గురించి మాట్లాడే ముందు నీ గేమ్ ఏంటో నువ్వు తెలుసుకో అంటూ చురక అట్టించింది తనూజ. నువ్వు పెద్ద ఫేక్ అని, నీలా ఉండలేను, బాండింగ్ ల కోసం హౌజ్ రాలేదంటూ తనూజకి కౌంటర్ వేసింది. నువ్వు నాలా ఉండలేవు.. ఉండవు కూడా అంటూ రమ్యకు గట్టిగా ఇచ్చిపడేసింది తనూజ. రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ కదా.. వచ్చి సౌండ్ అంటూ మాధురి, రమ్యలకు గట్టి కౌంటర్ వేసింది. రెండు చేతులు కలిపి కొడితే వచ్చే సౌండ్ కన్న.. సింగిల్ హ్యాండ్ తో వేసే విజిల్ .. సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. అంటూ విజిలేసి మరి ఇచ్చిపడేసింది తనూజ. ఇక తనూజ విశ్వరూపం చూసి హౌజంత విస్తుపోయింది. ఆమె విజిల్ సౌండ్ కి మాధురి, ఆయేషా ఇచ్చిన రియాక్షన్ ప్రొమోలో హైలెట్ గా నిలిచింది. తనూజ విశ్వరూపం చూపించింది.. ఆమె విజిల్ కి మాధురి, ఆయేషా దగ్గర రీసౌండ్ గట్టిగా వినిపించిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss 9 Winner: విన్నర్ ఎవరో చెప్పేసిన హైపర్ ఆది.. ఈసారి టైటిల్ ఆమెదే, టాప్ 5లో రీతూ పక్కా

Related News

Thanuja: కన్నింగ్ కు కేర్ అఫ్ అడ్రస్, మరి ఇంతలా నటించాలా?

Bigg Boss 9 Winner: విన్నర్ ఎవరో చెప్పేసిన హైపర్ ఆది.. ఈసారి టైటిల్ ఆమెదే, టాప్ 5లో రీతూ పక్కా!

Bigg Boss 9 Promo: తనూజ దెబ్బకు పచ్చళ్ళ పాప సైలెంట్.. గట్టిగా ఇచ్చిందిగా!

Bigg Boss 9 Promo: ఆయేషా వర్సెస్ రీతూ.. మరీ ఇంత ఆటిట్యూడ్ అయితే ఎలా?

Thanuja: సిగ్గు లేదా తనుజా.. క్యారెక్టర్ తక్కువ చేసినా కూడా మళ్లీ మాట్లాడుతున్నావ్

Bigg Boss 9: ఫ్యామిలీ మెసేజ్, టెన్షన్ పడ్డ సంజన, ఆది కామెంట్స్ కి మొహం మాడ్చిన ఆయేషా

Bigg Boss Buzz: మనకి బంధాల అవసరమా, భరణికి మరోసారి క్లాస్ పీకిన శివాజీ

Big Stories

×