iPhone16 Flipkart Offer: దీపావళి సీజన్ అంటే షాపింగ్‌కు పండుగ. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆన్‌లైన్ మార్కెట్‌లలో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది దీపావళి సేల్ లో వినియోగదారులను ఆశ్చర్యపరిచే ఆఫర్ తీసుకొచ్చింది. అందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది iPhone 16. సాధారణంగా 80 వేల రూపాయలకు పైగా ఉండే ఈ ఫోన్ ఇప్పుడు కేవలం ₹35,000 లో లభిస్తోంది అనే వార్తతో అందరి దృష్టి ఫ్లిప్‌కార్ట్ మీదే పడింది.
అక్టోబర్ 28 వరకు ప్రత్యేక ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ “Big Diwali Sale” పేరుతో అక్టోబర్ 28 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. దీపావళి సమీపిస్తున్నందున చివరి మూడు రోజుల్లో లాస్ట్ మినిట్ సేల్ పేరుతో అద్భుతమైన తగ్గింపులు ప్రకటించింది. అందులో iPhone 16 ధర నిజంగా వినియోగదారుల్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఈ ఫోన్ 79,900 రూపాయలకి పైగా ఉంటుంది. కానీ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్‌తో కలిపి ఇప్పుడు ₹34,999 లో అందుబాటులో ఉంది. దీన్ని చూసి చాలా మంది వినియోగదారులు వెంటనే ఆర్డర్ చేస్తున్నారు.
ఎందుకు ఈ డీల్ హాట్‌గా మారింది?
ఇక ఈ ఆఫర్ వెనుక ఉన్న నిజం ఏమిటంటే — ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దీపావళి సీజన్‌లో స్టాక్ క్లియరెన్స్ ఆఫర్‌గా భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి ,ఐసిఐసిఐలు వంటి బ్యాంక్‌ల కార్డులు ఉపయోగిస్తే అదనంగా రూ.5 వేలు వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. అదేవిధంగా పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ ఆప్షన్ తీసుకుంటే, మోడల్ ఆధారంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు వస్తోంది. ఈ రెండు ఆఫర్లు కలిపి చూడగానే ఐఫోన్ 16 ధర రూ.35,000 లోకి వస్తోంది.
Also Read: Amazon Services: అమెజాన్ షాకింగ్ న్యూస్.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వెబ్ సర్వీసెస్
ఫీచర్లు నిజంగా లగ్జరీ స్మార్ట్‌ఫోన్
ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు చూసినా, అది నిజంగా లగ్జరీ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. 6.1 అంగుళాల సూపర్ రెటీనా క్సడ్ర్ ఓల్డ్ డిస్‌ప్లే, తాజా A18 బయోనిక్ ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఐఓఎస్ 18 ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కలిసి వినియోగదారులకు స్మూత్ అనుభవాన్ని ఇస్తాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా పూర్వ మోడళ్ల కంటే మెరుగ్గా ఉండి, సింగిల్ ఛార్జ్‌తో 28 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ అందిస్తుంది.
సినిమాటిక్ మోడ్ లాంటి ఆప్షన్లు
కెమెరా క్వాలిటీ పరంగా కూడా ఐఫోన్ 16 అందరినీ ఆకట్టుకుంటోంది. కాంతి తక్కువ ఉన్న ప్రదేశాల్లోనూ స్పష్టమైన ఫోటోలు తీసే సామర్థ్యం ఉంది. వీడియో షూటింగ్‌లో 4కె రికార్డింగ్, సినిమాటిక్ మోడ్ లాంటి ఆప్షన్లు ఈ ఫోన్‌ని ప్రొఫెషనల్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. ఫోటోగ్రఫీ, వీడియో మేకింగ్, రీల్స్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
లిమిటెడ్ స్టాక్
ఇంకా ముఖ్యంగా ఈ ఆఫర్ ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే, ఇప్పటి వరకు ఎప్పుడూ లేని స్థాయిలో ఐఫోన్ ధర తగ్గించడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఫ్లిప్ కార్ట్ సేల్‌లో “లిమిటెడ్ స్టాక్” అని స్పష్టంగా పేర్కొనడంతో ప్రజలు తొందరగా కొనుగోలు చేస్తున్నారు. స్టాక్ వేగంగా అయిపోతుందని కంపెనీ కూడా తెలిపింది. కాబట్టి కొనాలనుకునే వారు ఆలస్యం చేయకూడదు.
Flipkart సేల్‌లో ఎలా కొనాలి?
* ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* సెర్చ్ బార్‌లో “iPhone 16” అని టైప్ చేయాలి.
* “Diwali Last Minute Deal” ట్యాగ్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవాలి.
* ఆఫర్ అప్లై అయ్యిందో లేదో చెక్ చేసి, సరైన బ్యాంక్ కార్డ్ ఉపయోగించాలి.
* పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఐఫోన్ కాదు.. మిగతా ఫోన్లపై కూడా ఆఫర్లు
ఇది కేవలం ఐఫోన్ ఆఫర్ మాత్రమే కాదు, ఈ సేల్‌లో శామ్‌సంగ్, వన్‌ప్లస్, గూగుల్ పిక్సెల్, షియోమి వంటి కంపెనీల ఫోన్లపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వాచీలు, హోమ్ అప్లయెన్సులపై కూడా బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.