OTT Movie : హారర్ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు టెన్షన్ పెట్టించే స్టోరీ, ఉలిక్కి పడే సన్నివేశాలతో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తుంటాయి. ఆడియన్స్ ని పూర్తిగా జడిపించే సినిమాలు, అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతుంటాయి. ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ‘వాష్ లెవల్ 2’ సినిమా ఆడియన్స్ ని తెగ భయపెడుతోంది. ఇది 2023లో వచ్చిన “వాష్” మూవీకి సీక్వెల్ గా వచ్చింది. మొదటి పార్ట్ ఆడియన్స్ కి ప్యాంట్లు తడిపేసింది. ఇప్పుడు వచ్చిన పార్ట్ 2 అంతకు మించి అన్నట్లు ఉంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా వివరాలను తెలుసుకుందాం పదండి.
‘వాష్ లెవల్ 2’ (Vash level 2) 2025లో వచ్చిన గుజరాతీ సూపర్ నాచురల్ సైకలజికల్ హారర్ మూవీ. కృష్ణదేవ్ యాగ్నిక్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో అథర్వా (హితు కనోడియా), ఆర్యా (జంకీ బోదీవాల), ప్రతాప్ (హితెన్ కుమార్), మోనల్ గజ్జర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల అయింది. ఇది 2023లో వచ్చిన “వాష్” మూవీకి సీక్వెల్. IMDbలో దీనికి 7.9/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా Shemaroo me ఓటీటీలో నవంబర్ లో వచ్చే అవకాశం ఉంది.
అథర్వా తన కూతురు ఆర్యాను మొదటి పార్ట్ లో ఒక బ్లాక్ మ్యాజిక్ నుంచి పోరాడి కాపాడతాడు. కానీ ఆ మంత్రం ఆర్యాలో ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది. ఇది జరిగిన 12 సంవత్సరాల తర్వాత, గుజరాత్‌లో ఒక స్కూల్‌లో చిన్న పిల్లలు వింతగా ప్రవర్తిస్తారు. వాళ్లు వింతగా ప్రవర్తిస్తూ మైండ్ కంట్రోల్ తప్పుతుంటారు. కొందరు గొడవలు చేసి మనుషుల్ని గాయపరుస్తారు. మరి కొందరు సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు. అథర్వాకు ఈ సమస్య గతంలో జరిగిన బ్లాక్ మ్యాజిక్ తో లింక్ అయి ఉందని అనిపిస్తుంది. ప్రతాప్ అనే ఒక మంత్రగాడు ఈ విధ్వంసాన్ని సృష్టిస్తాడు. అథర్వా, ఆర్యా కలిసి ఈ చేతబడి మంత్రాన్ని ఆపడానికి ట్రై చేస్తారు.
Read Also : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ
కథ నడిచే కొద్ది స్కూల్‌లో పిల్లలు ఈ మంత్రం వల్ల ప్రమాదంలో పడుతుంటారు. మంత్రగాడు చేతబడి చేసి స్కూల్‌ను, గ్రామాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. అథర్వా తన స్నేహితులతో కలసి, ఈ కుట్రను ఆపడానికి పోరాడతాడు. ఆర్యా కూడా ఆ మంత్రం వల్ల డేంజర్‌లో పడుతుంది. అథర్వా ఆ మంత్రగాడి గురించి తెలుసుకుని, అతని మంత్ర శక్తిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కథలో భయంకర సీన్స్, ట్విస్ట్‌లు ఊపిరి పీల్చుకోకుండా చేస్తాయి. చివరికి అథర్వా ఆ మాంత్రికుడిని కంట్రోల్ చేస్తాడా ? తన కూతురిని, స్కూల్ పిల్లలను కాపాడతాడా ? మంత్ర శక్తి పూర్తిగా పోతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.