Big Stories

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి కారణమిదే.. రైల్వే మంత్రి క్లారిటీ..!

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి మూల కారణాన్ని తెలుసుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ప్రకటించారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలను రైల్వేమంత్రి పర్యవేక్షిస్తున్నారు.ఈ సమయంలో రైలు ప్రమాదంపై కీలక విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ప్రమాదానికి కారణమైన తప్పిదాన్ని కనిపెట్టారని తెలిపారు. దీనికి బాధ్యులను కూడా గుర్తించారని చెప్పారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ చర్యలపైనే దృష్టి పెట్టామన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయన్నారు.ప్రస్తుతం రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మృతదేహాలను పూర్తిగా తొలగించామని తెలిపారు.

- Advertisement -

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృత్యువాత పడ్డారు. 1,175 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News