BigTV English

Osmania University: ఓయూ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవుల్లోను హాస్టల్ ఓపెన్

Osmania University: ఓయూ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవుల్లోను హాస్టల్ ఓపెన్

 


Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు రిజిస్టార్ శుభవార్త తెలిపారు. వేసవి సెలవుల్లోను పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు హాస్టళ్లు మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వేసవి సెలవుల్లోను యూనివర్సిటీ హాస్టల్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు రిజిస్టార్ ఓ ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల్లోను హాస్టల్, మెస్ తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం యూనివర్సిటీకి మే 1 నుండి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

విద్యార్థులు పరీక్షలు పూర్తి అయినా కూడా, ఎంట్రెన్స్ పరీక్షల కోసం హాస్టళ్లలో ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ తరుణంలో హాస్టల్, మెస్ మూసివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం అంటూ విద్యార్థుల నుంచి విజ్ఞప్తి మేరకు క్యాంపస్ హాస్టల్ తెరిచే ఉంచుతామని ప్రకటించారు. అంతేకాదు రిపేర్లు చేయడానికి కూడా ఈ సమయం ఉపయోగపడుతుందని, దీంతో పాటు విద్యార్థులకు కూడా చదువుకోవడానికి వీలు అవుతుందని పేర్కొన్నారు.


విద్యార్థులు ప్రిపేర్ అయ్యే పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాస్టల్ లో ఉండి చదువుకోవచ్చని రిజిస్టార్ ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి సెలవుల్లోను అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. నీటి సమస్య, కరెంటు కొరత వంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు.

Related News

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×