E-Paper
Advertisement

Congress MP Candidates: మరో లిస్ట్‌ను విడుదల చేసిన కాంగ్రెస్.. అందులో ఆ 2 సీట్లు తప్ప మిగతా..

Congress MP Candidates: మరో లిస్ట్‌ను విడుదల చేసిన కాంగ్రెస్.. అందులో ఆ 2 సీట్లు తప్ప మిగతా..
Advertisement

Congress MP Candidates List: కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో లిస్ట్ ను విడుదల చేసింది. నాలుగు పార్లమెంటు స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను అందులో ప్రకటించింది. హర్యానాలోని గుర్గాన్ నియోజకవర్గం నుంచి రాజ్ బబ్బార్, హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ పోటీ చేయనున్నారని తెలిపింది. హమిర్ పూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ రైజాదా పేరును ప్రకటించింది.

అయితే, ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ కీలకంగా మారింది. అదేవిధంగా మహారాష్ట్రలోని ముంబై నార్త్ స్థానం నుంచి భూషణ్ పాటిల్ పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. అదేవిధంగా ఒడిశాలోని కకట్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా భిశ్వ భూషణ్ దాస్ పేరును ప్రకటించింది.

Advertisement

అయితే, లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజుకు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నది. అయితే, కాంగ్రెస్ ఇంకా ప్రతిష్మాత్మకమైనటువంటి అమేథి, రాయ్ బరేలీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించలేదు.

Also Read: ‘కలలు కనకండి.. ఎప్పటికీ అలా జరగనివ్వం’

Advertisement

ఈ నేపథ్యంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే, తాజాగా విడుదల చేసిన లిస్ట్ లోనైనా అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల అభ్యర్థులు ఉంటారని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ ఇంకా అందుకు సంబంధించి పేర్లను ప్రకటించలేదు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×