BigTV English

Health Benefits Of Dance: డ్యాన్స్ చేస్తే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..

Health Benefits Of Dance: డ్యాన్స్ చేస్తే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..

Health Benefits Of Dance: డ్యాన్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. డ్యాన్స్ చేయరాని వారికి కూడా ఒక్కసారి మ్యూజిక్ వినిపిస్తే చాలు కాళ్లు ఆటోమెటిక్ గా డ్యాన్స్ చేస్తాయి. డ్యాన్స్ కి అంత పవర్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి తరం యువతకు డ్యాన్స్ అంటే పిచ్చి అనే చెప్పాలి. చిన్న పిల్లాడి నుంచి ముసలి వాళ్ల వరకు డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్న వీడియోలు కూడా చూస్తూనే ఉన్నాం.


అయితే డ్యాన్స్ కేవలం ఆనందం, స్టేజ్ షోలకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా డ్యాన్స్ తో అనేక ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. తరచూ డ్యాన్స్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందట.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా డ్యాన్స్ చాలా బాగా ఉపయోగపడుతుందట. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని కేలరీలు బర్న్ అయి బరువు తగ్గుతారు. అలా ఒక గంట సేపు డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని కేలరీలు 400 నుంచి 600 వరకు బర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయట. అంతేకాదు డ్యాన్స్ ఇన్ టెన్సిటీ, డ్యాన్స్ ఫామ్ బట్టి ఇది ఆధారపడి ఉంటుందట.


డ్యాన్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. రోజూ డ్యాన్స్ చేయడం వల్ల హార్ట్ బీట్ స్థిరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గుండె సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా తరచూ వాకింగ్, వ్యాయామం చేసే వారి కంటే డ్యాన్స్ చేసే వారి గుండె ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందని తేలింది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా డ్యాన్స్ చేయడం వల్ల ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×