BigTV English

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

 


Encounter: ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య మరోసారి కాల్పుల యుద్ధం చోటుచేసుకుంది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ భారీ ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది నక్సలైట్లను హతం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది.

స్పెషల్ టాస్క ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ డీఆర్‌జీ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలపాలు కాలేదని తెలిపారు. అయితే ఘటన స్థలంలో ఏకే 47 తుపాకీ, మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భద్రతా సిబ్బంది, మావోల మధ్య జరిగిన కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోలు మరణించారు.


ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించగా.. మొత్తం ఈ ఏడాది బస్తర్ అడవుల్లో 90 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

 

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×