Big Stories

Odisha Train Accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. ఆడియో వైరల్..

Odisha train accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం జరిగినట్లు… రైల్వే అధికారుల అంతర్గత విచారణలో బయటపడింది. దీనికి సంబంధించిన ఇద్దరు అధికారుల ఫోన్‌ కాల్ ఆడియో… ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తప్పిదం ఎలా జరిగిందో… స్థానిక అధికారుల ద్వారా ఉన్నతాధికారులు ఆరా తీశారు. సౌత్ వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్… ట్రాఫిక్ విభాగానికి చెందిన డిప్యూటీ చీఫ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ను, ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు.

- Advertisement -

ప్రమాదానికి ముందు ఘటనా స్థలంలో పని చేసిన రైల్వే సిబ్బంది… ఆ సమయంలో మెయిన్‌లైన్‌ను లూప్‌ లైన్‌కు కలిపారు. పని పూర్తయ్యాక తిరిగి పట్టాలను మెయిన్‌ లైన్‌కు కలపకుండా వదిలేశారు. ఆ విషయం గమనించకుండా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్టేషన్ మాస్టర్ మెయిన్‌లైన్‌లో గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రైలు మెయిన్‌లైన్‌లో దూసుకెళ్లింది.

- Advertisement -

ట్రాక్‌ లింక్‌ లూప్‌లైన్‌లోకి ఉండటంతో అటువైపే వెళ్లి, అప్పటికే ఆ ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును అతివేగంతో ఢీకొంది. దాంతో కోరమాండల్ బోగీలు డౌన్‌ మెయిన్‌లైన్‌పై పడిపోయాయి. ఆ బోగీలను హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో పెను విషాదం చోటు చేసుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News