Big Stories

Chevireddy With No Action: చెవిరెడ్డి @ నో యాక్షన్ ప్లాన్

Chevireddy Bhaskar reddy latest news(AP election updates):ఒంగోలు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఆపార్టీ నేతలు చిటపటలాడుతున్నారు. మమ్మల్ని నమ్మడు, మాకేం చెప్పడు, పెత్తనమంతా పరాయి వాళ్లకే ఇస్తున్నాడంటూ కిందిస్థాయిలోని నాయకులు గగ్గోలుపెడుతున్నారు. తాము చెవిరెడ్డి దూతలమంటూ  ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న నాన్‌లోకల్ వ్యక్తుల హడావుడితో నేతలు చికాకుపడుతున్నారు. ఆ క్రమంలో ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీలో అంతర్గత సమస్యలు పెరిగిపోవడం చెవిరెడ్డిని కలవరపెడుతున్నాయట.. ఇంతకీ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ వైసీపీలో ఎం జరుగుతుంది?

- Advertisement -

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో జగన్ సన్నిహితుల్లో ఒకరిగా ఫోకస్ అవుతున్న నాయకుడు. గత ఎన్నికలలో చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అక్కడ తన కొడుకు మోహిత్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న చెవిరెడ్డి అనూహ్యంగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో దిగాల్సివచ్చింది. ఆయన ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా వస్తున్నారనగానే జిల్లా వైసీపీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆఖరికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయన్ని వ్యతిరేకించారు. అయితే వైసీపీ పెద్దల మంత్రాంగంతో చెవిరెడ్డే నామినేషన్ వేశారు.

- Advertisement -

చెవిరెడ్డి ఒంగోలులో ఎంట్రీ ఇవ్వగానే .. స్థానిక నేతలు, కొందరు అభ్యర్ధులు ఏవేవో ఆశలు పెట్టుకున్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లోకల్ లీడర్లు ఆశల పల్లకిలో విహరించారు. అయితే అవేమీ నెరవేరకపోవడంతో పాటు .. అసలు చెవిరెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటో అంతుపట్టక.. సెగ్మెంట్‌కు ఎప్పుడు వస్తారో? ఏంటో? క్లారిటీ లేక తెగఇదై పోతున్నారిప్పుడు . చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అఫిషియల్‌గా ఎక్కడా ఎలక్షన్ ఆఫీసు ప్రారంభించలేదు. దాంతో చెవిరెడ్డిని కలవటానికి సామన్య కార్యకర్తలు ఇక్కట్లు పడాల్సి వస్తుంది. ఆయన ఎక్కువగా తన వారసుడు మోహిత్ రెడ్డి పోటీలో ఉన్నచంద్రగిరిపైనే ఫోకస్ పెడుతున్నారంట.

Also Read: ఫ్యామిలీ వార్.. సై అంటే సై

ఒంగోలులో చెవిరెడ్డి టీం నుంచి మండాలానికి ఒక్కరిని ఇన్చార్జ్‌గా పెట్టినా వారి బాసిసజాన్ని లోకల్ వైసీపీ నేతలు యాక్సప్ట్ చేయాలేక పొతున్నారంట. ఇక ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వలంటీర్లకు రెండు నెలల నుంచి చెవిరెడ్డి డబ్బులు పంపిస్తున్నట్లు బహిరంగంగా చెబుతున్నారు. ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున మొదటి నెలలో డబ్బులతో పాటు గిప్టులు కూడా ఇచ్చారట. ఈ నెలలో కేవలం డబ్బులు పంపారంటున్నారు. అయితే గత నెలలో పలుచోట్ల వాలంటీర్లకు గిఫ్ట్‌లు అందలేదంట. అలాంటి వారంతా లోకల్ లీడర్లపై వత్తిడి తెస్తున్నారంట. ఆ క్రమంలో సదరు వాలంటీర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వైసీపీ కౌన్సిలర్లు, ఇన్‌చార్జిలకు.. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ డివిజన్‌ అధ్యక్షులకు తాయిలాలు అందుతున్నట్లు తెలుస్తోంది. అలా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిలో ఒక్కొక్కరికి లక్ష పంపిణీ చేశారంట. తాజాగా ఒంగోలులో ఒక్కో కార్పొరేటర్‌కు 3 లక్షల ప్రకారం ఇచ్చారని డివిజన్‌ వైసీపీ అధ్యక్షులకు కూడా కాస్త అటూఇటూ అంతే పంచారని చెప్పుకుంటున్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి మునిసిపాలిటీల్లోని కౌన్సిలర్లు తమకు లక్ష ఇచ్చి ఒంగోలు కార్పొరేటర్లకు మూడు లక్షలు ఎలా ఇస్తారని.. తమకు అంతే అమౌంట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారంట.

ప్రస్తుతం చెవిరెడ్డి పొదిలి కేంద్రంగా వ్యవహారం నడిపిస్తూ రోజువారీ ఏదో ప్రాంతానికి వెళ్లడం, కొన్ని ప్రాంతాల్లో కాసేపు కారులోనే వేచి ఉండటం. మరికొన్ని పాంత్రాల్లో కిందకు దిగి కనిపించిన ప్రజలను ఆలింగనం చేసుకొని మాటలు చెప్పి వెళ్లిపోవడం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నాయకులకు ఎవరో చెబితే గాని చెవిరెడ్డి వచ్చిపోయిన విషయం తెలియడం లేదంట. దీనికి తోడు పొదిలి కేంద్రంగా ఆయన సుమారు 80 మంది సొంత వ్యక్తులను ఉంచి. వారిని రోజువారీ ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపుతున్నారు.

Also Read: అన్న, తమ్ముడు Vs అక్క , చెల్లి

వారు సాయంత్రానికి అక్కడి పరిస్థితులపై చెవిరెడ్డికి సమాచారాన్ని ఇస్తుంటారంట. తదానుగుణంగా ఆయన అక్కడ ఇది జరుగుతుంది .. ఇక్కడ ఇది జరుగుతుంది అంటూ అసెంబ్లీ అభ్యర్థులకు సమాచారం పంపుతున్నారంట. కొన్నిచోట్ల చెవిరెడ్డి టీం సభ్యులే కిందిస్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఏం చేయాలో చెప్తున్నారంట. దీంతో కిందిస్థాయిలోని వైసీపీ నాయకులు ఈ పరాయి పెత్తనం ఇలాగే సాగితే భరించలేమంటూ బహిరంగంగానే విసుక్కుంటున్నారు.

ఒంగోలు టీడీపీ ఎంపి అభ్యర్ధిగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటు ఒంగోలు‌లో ఒక ఆఫీసు, అటు మార్కాపురంలో ఒక ఆఫీసు ఏర్పాటు చెసుకుని అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చెవిరెడ్డి వచ్చాడు. ఎదో చెస్తాడు అనుకున్న వైసిపి నేతాలకు చెవిరెడ్డి దొరక్కపోవడంతో వారిలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. మొత్తం పంపకాలతో పనైపోతుందన్నట్లు చెవిరెడ్డి తన టీంతో ఆ తతంగం నడిపిస్తూ ప్రచారంలో పెద్దగా కనిపించకపోతుండటంతో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరి చెవిరెడ్డి మార్క్ చంద్రగిరి పాలిటిక్స్ ఒంగోలులో ఏ మాత్రం వర్కైట్ అవుతాయో చూడాలి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News