BigTV English

Kesineni Nani : బీజేపీ నేతలపై కేశినేని ప్రశంసలు.. కాషాయ కండువా కప్పుకుంటారా?

Kesineni Nani : బీజేపీ నేతలపై కేశినేని ప్రశంసలు.. కాషాయ కండువా కప్పుకుంటారా?

Kesineni Nani : టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని దారెటు? రాజకీయాల్లో కొనసాగుతానంటూ ఓ క్లారిటీ అయితే ఇచ్చారాయన. మరి ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తారా.. ? ఇతర పార్టీల్లోకి వెళ్తారా? ఈ ఉత్కంఠ మధ్య బీజేపీపై ప్రశంసలు గుప్పించారు కేశినేని నాని. తన నియోజకవర్గం అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహకారం అందించారంటూ అన్నారు.


కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్రకు విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, బీజేపీ మూడు సమాన స్థాయికి చేరుకుంటాయనే ఆశాభావం ఉండేదని కేశినేని నాని చెప్పడం ఆసక్తిగా మారింది.

కేశినేని చేసిన తాజా వ్యాఖ్యలు దేనికి సంకేంతం? ఆయన బీజేపీవైపు అడుగులు వేస్తున్నారా? అందుకే బీజేపీ నేతలపై ప్రశంసలు కురిపించారా?


Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×