E-Paper
Advertisement

భూమికి కవల గ్రహం.. శుక్రుడిపై ఒక రోజు గడిపారో.. మీకు కనిపించే వింతలు ఇవే!

భూమికి కవల గ్రహం.. శుక్రుడిపై ఒక రోజు గడిపారో.. మీకు కనిపించే వింతలు ఇవే!
Advertisement

Venus Planet: సమాన పరిమాణం, ఒక విధమైన రూపురేఖలు ఉండటం వల్ల శుక్ర గ్రహాన్ని తరచూ భూమికి కవలగా పిలుస్తుంటారు. అయితే సీసాన్ని సైతం కరిగించగల వేడి, దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వాయువులు, ఊహకు అందని పీడనం వంటి పరిస్థితుల కారణంగా అక్కడ మనుగడ అసాధ్యంగా మారింది. ఒకవేళ శుక్రుడిపై ఒకరోజు గడపగలిగితే అక్కడ ఎదురయ్యే వింతలు, విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

భూమికి ఎందుకింత భిన్నం?

శుక్రుడి వాతావరణంలో 96 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉండటం వల్ల తీవ్రమైన గ్రీన్‌హౌస్ ప్రభావం ఏర్పడుతోంది. వేడి వాతావరణంలోనే బంధించబడటంతో ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 870 డిగ్రీల ఫారెన్‌హీట్ (465 డిగ్రీల సెల్సియస్) వరకు చేరుతుంది. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న బుధుడి కంటే కూడా శుక్రుడిపై వేడి ఎక్కువగా ఉంటుందట. ఇక శుక్రుడి ఉపరితలం పొడిగా, ఎరుపు-నారింజ రంగులో దర్శనమిస్తుందట. అక్కడ దాదాపు మూడింట రెండు వంతుల మేర చదునైన మైదానాలు విస్తరించి ఉన్నాయని.. భవిష్యత్తులో ఎప్పుడైనా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేయాల్సి వస్తే ఈ మైదానాలే అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

93 రెట్లు బరువుగా వాతావరణం

Advertisement

శుక్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే సుమారు 91 శాతం వరకూ ఉంటుంది. అంటే వస్తువులు ఇక్కడితో పోలిస్తే కొంచెం తేలికగా అనిపిస్తాయి. అంతేకాకుండా మనం గెంతితే భూమిపై కంటే ఇంకా ఎత్తుకు ఎగురవచ్చు. కానీ దట్టమైన గాలి వల్ల చేతిని వేగంగా కదిపితే గాలిలో కాకుండా నీటిలో కదిలినట్లు అనిపిస్తుందట. భూమిపై సముద్ర మట్టంలో పీడనం 1 బార్ ఉండగా శుక్రుడి ఉపరితలంపై అది 92 బార్‌ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై ఇంతటి పీడనాన్ని అనుభవించాలంటే సముద్రంలో 3,000 అడుగుల (914 మీటర్లు) లోతుకు వెళ్లాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. భూమి వాతావరణంతో పోలిస్తే శుక్రుడి వాతావరణం సుమారు 93 రెట్లు ఎక్కువ బరువుగా ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు.

ఒకరోజు కంటే సంవత్సరమే చిన్నది

సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి శుక్రుడికి 225 భూమి రోజులు పడుతుంది. కానీ తన అక్షం చుట్టూ తాను ఒకసారి తిరగడానికి దాదాపు 243 రోజులు పడుతుంది. అంటే ఒక రోజు కంటే సంవత్సరమే తక్కువ అన్నమాట. 2006–2020 మధ్య చేసిన రాడార్ పరిశీలనల ప్రకారం.. యావరేజ్ గా శుక్రుడిపై ఒక రోజు భూమిపై 243.0226 రోజులకు సమానం.

పశ్చిమాన సూర్యోదయం

Advertisement

ఇతర గ్రహాలకు భిన్నంగా శుక్రుడు వ్యతిరేక దిశలో తిరుగుతాడు. అందువల్ల అక్కడ సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. అటు శుక్రుడిపై ఒక మధ్యాహ్నం నుంచి మరో మధ్యాహ్నానికి సుమారు 117 భూమి రోజులు పడుతుంది. మరోవైపు కార్బన్ డయాక్సైడ్ అణువుల వల్ల ఆకాశం ఎరుపు-నారింజ రంగులో కనిపిస్తుంది. సూర్యుడు స్పష్టమైన గోళంలా కాకుండా మబ్బుల వెనుక మసక మసకగా కనిపిస్తాడు. రాత్రి వేళ ఆకాశం నల్లగా ఉన్నా నక్షత్రాలు కనిపించవట.

Also Read: ఏంటీ.. అగ్నిపర్వత విస్ఫోటనాలు.. భూమిని కూల్‌గా ఉంచుతున్నాయా? ఎలాగో తెలిస్తే థ్రిల్ పక్కా!

గంటకు 400 కి.మీ వేగంతో గాలులు..

శుక్ర గ్రహంపై గాలుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎగువ వాతావరణంలో గంటకు 249 మైళ్ల (400 కి.మీ) వేగంతో గాలులు వీస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉపరితలం వద్ద మాత్రం గంటకు కేవలం 2 మైళ్ల (3 కి.మీ) వేగంతోనే అవి కదులుతాయి. మరోవైపు మెరుపులు, వర్షాలు నేలను తాకకముందే ఆవిరైపోతాయి. భూమిలా టెక్టోనిక్ ప్లేట్లు లేకపోవడంతో భూకంపాలు రావు. ఫలితంగా నేలలో ఉష్ణోగ్రత ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి.. అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా బయటకు వస్తుంటాయి.

Also Read: పెళ్లి, సాఫ్ట్ వేర్ జాబ్ వద్దు.. డెలివరీ బాయ్ పనే ముద్దు.. ‘జెన్ జీ’ యువత నయా ట్రెండ్!

Tags

Related News

హోటల్‌లో అడుగుపెట్టగానే ఈ పని చేయండి.. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది!

5G ఫోన్ వాడుతున్నా ఇంకా 4G సిగ్నలే వస్తోందా? ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఏంటీ.. అగ్నిపర్వత విస్ఫోటనాలు.. భూమిని కూల్‌గా ఉంచుతున్నాయా? ఎలాగో తెలిస్తే థ్రిల్ పక్కా!

గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. యాపిల్, శాంసంగ్ ఫోన్లపై రూ.46,000 వరకు తగ్గింపు.. బ్లాక్ ఫ్రైడే సేల్ టాప్-10 డీల్స్ ఇవే!

యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

Big Stories

Advertisement
×