E-Paper
Advertisement

క్యూబ్ ఆకారంలో మల విసర్జన.. ప్రపంచంలో ఈ ఒక్క జంతువుకే సాధ్యం!

క్యూబ్ ఆకారంలో మల విసర్జన.. ప్రపంచంలో ఈ ఒక్క జంతువుకే సాధ్యం!
Advertisement

Wombat Poop Mystery: జంతువుల ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని జంతువులు ప్రత్యేకమైన శబ్దాలు చేస్తే, మరికొన్ని తమ శరీర నిర్మాణంతో ఆశ్చర్యపరుస్తాయి. అయితే, ఆస్ట్రేలియాలో కనిపించే ఓ జంతువు మాత్రం వీటన్నింటికంటే చాలా డిఫరెంట్. సాధారణంగా జంతువులు విసర్జించే మలం గుండ్రంగా లేదంటే ఒక ఆకరం అంటూ లేకుండా ఉంటుంది. కానీ, ఈ జంతువు మాత్రం అచ్చంగా చిన్న చిన్న క్యూబ్‌ల ఆకారంలో మలాన్ని విసర్జిస్తుంది. ఇంతకీ ఆ వింత జంతువు ఏది? దాని మలం అలా మారడానికి కారణమేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ వింత జంతువు పేరు వోంబాట్!

ఆస్ట్రేలియాకు చెందిన ఈ జంతువు పేరు వోంబాట్ (Wombat). ప్రపంచంలో సహజంగా ఘనాకారంలో మలాన్ని విసర్జించే ఏకైక జంతువుగా వోంబాట్ గుర్తింపు పొందింది. చూడటానికి చిన్న ఎలుగుబంటిని పోలి ఉండే ఈ జంతువు ఎక్కువగా భూమి లోపల బొరియలు తవ్వుకుని జీవిస్తుంది. వోంబాట్ మలాన్ని చూస్తే చిన్న చిన్న క్యూబ్స్ లా కనిపిస్తుంది. ఇవి ఎందుకు అలా ఉంటాయన్న ప్రశ్న చాలాకాలంగా శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన అంశంగా మారింది.

పేగుల నిర్మాణమే అసలు రహస్యం!

Advertisement

వోంబాట్ మలం క్యూబ్ ఆకారంలోకి మారడానికి దాని పేగుల నిర్మాణమే ప్రధాన కారణం. సాధారణంగా మలం బయటకు వచ్చే మార్గం గుండ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు మలం మాత్రం చతురస్రాకారంలో ఎలా తయారవుతుందనే డౌట్ రావచ్చు. వోంబాట్ పేగుల చివరి భాగంలో కండరాల నిర్మాణం ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల  గట్టిగా, మరికొన్ని చోట్ల మెత్తగా ఉంటాయి. జీర్ణక్రియ చివరి దశలో ఈ భాగాలు వేర్వేరు విధాలుగా సంకోచించడం, వ్యాకోచించడం వల్ల మలం క్యూబ్ ఆకారంలా మారుతుంది.

నీటిని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల..

వోంబాట్‌లు సాధారణంగా పొడి వాతావరణ ప్రాంతాల్లో జీవిస్తాయి. అందుకే శరీరంలో నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడం వీటికి చాలా అవసరం. ఆహారం జీర్ణమయ్యే సమయంలో పేగులు ఎక్కువ మొత్తంలో నీటిని పీల్చుకుంటాయి. దీంతో మలం పొడిగా, గట్టిగా మారుతుంది. ఫలితంగా ఏర్పడిన క్యూబ్ ఆకారం బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది.

ఈ ఆకారం వల్ల ఉపయోగం ఏంటి?

Advertisement

వోంబాట్‌లు తమ నివాస ప్రాంతాన్ని గుర్తించడానికి మలాన్ని ఒక గుర్తుగా ఉపయోగిస్తాయి. ముఖ్యంగా రాళ్లు, చెట్లు, ఎత్తైన ప్రదేశాల మీద మలాన్ని వదులుతాయి. క్యూబ్ ఆకారంలో ఉండటం వల్ల అవి కిందకు దొర్లిపోకుండా ఒకేచోట నిలిచి ఉంటాయి. మలంలోని ప్రత్యేకమైన వాసన ద్వారా ఇతర వోంబాట్‌లకు తమ ఉనికిని గుర్తిస్తాయి. ఇవి ఒక్క రాత్రిలో సుమారు 80 నుంచి 100 వరకు క్యూబ్ ఆకారపు మలాన్ని విసర్జిస్తాయి.

ప్రకృతి సృష్టించిన అద్భుతం!

చూడటానికి చిన్న విషయంలా అనిపించినా, వోంబాట్ మలం వెనుక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. పేగుల నిర్మాణం, కండరాల పనితీరు, నీటిని పీల్చుకునే విధానం కలిసి మలాన్ని ఈ ప్రత్యేక ఆకారం వచ్చేలా చేస్తున్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అందులో వోంబాట్ మరింత స్పెషల్ గా చెప్పుకోవచ్చు.

Read Also: అండమాన్ కాలాపాని జైలును తలపించే మరో జైలు.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

Tags

Related News

అండమాన్ కాలాపాని జైలును తలపించే మరో జైలు.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!

మందు కొడితే ఇంత మంచిగా మారిపోతారా? బ్యాంకాక్ వీధుల్లో విదేశీయుడి వింత ప్రవర్తన!

భక్తులు ఇచ్చే విరాళాలతో ఇన్ని సేవలా? టీటీడీ గురించి ఆసక్తికర విషయాలు!

శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల తేదీలు వచ్చేశాయ్!

తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే వీఐపీ దర్శనం!

Big Stories

Advertisement
×