E-Paper
Advertisement

ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది.. పూర్వం ఎల్ నినోను ఎలా ఎదుర్కొనేవారు? ఎలా బతికి బట్టకట్టేవారో తెలుసా?

ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది.. పూర్వం ఎల్ నినోను ఎలా ఎదుర్కొనేవారు? ఎలా బతికి బట్టకట్టేవారో తెలుసా?
Advertisement

Ancient El Nino Impact: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో సరిపడ వర్షాలు లేక.. తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు పంటలు లేక పెరిగిన నిత్యవసర ధరలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే.. ఏది లేని పూర్వపు రోజుల్లో కరువు, వరదలు, ఆహార కొరతను ఎలా ఎదుర్కొనేవారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. అయితే అప్పట్లో కరవు వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హింసకు దిగేవారన్న అభిప్రాయాలను చరిత్రకారులు వెల్లబుచ్చారు. అయితే తాజాగా పెరూలో చేసిన పరిశోధనలు ఈ అంచనాలు పూర్తిగా తలకిందులు చేశాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

1500 మంది అస్థిపంజరాలపై పరిశోధన

ఉత్తర పెరూ తీరంలోని లాంబాయెక్యూ లోయకు చెందిన 1,500 మందికి పైగా ప్రాచీన మానవుల అస్థిపంజరాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. తీవ్ర వాతావరణ మార్పుల సమయంలోనూ వారి జీవితంలో హింస చాలా అరుదుగా ఉండేదని గుర్తించారు. 30 ప్రాంతాల్లో 3,000 ఏళ్లకు పైగా విస్తరించిన ఈ అధ్యయన వివరాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ ఆర్కియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇందులో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగు చూశాయి.

ప్రకృతి శాంతికోసం నరబలులు

Advertisement

పొడి వాతావరణం ఉండే లాంబాయెక్యూ లోయ ప్రాంతంలోని ప్రజలు.. అప్పట్లో ప్రధానంగా నదులు, సముద్రంపై ఆధారపడి జీవించేవారు. అయితే ఎల్ నినో ప్రభావంతో ఆ రోజుల్లోనూ సముద్రపు నీరు వేడెక్కి చేపల సంపద తుడిచిపెట్టుకుపోవడం, కుండపోత వర్షాలతో వరదలు రావడం వల్ల వ్యవసాయం, మత్స్యరంగం దెబ్బతిని ఆహార సంక్షోభం తలెత్తేది. మోచే, సికాన్ నాగరికతల పతనానికి ముందు పెద్ద ఎత్తున నరబలులు ఇచ్చిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ప్రకృతి శక్తులను శాంతింపజేసి తిరిగి సమతుల్యత సాధించేందుకే పాలకులు ఇలాంటి కఠినమైన ఆచారాలకు పాల్పడ్డారని పరిశోధకులు చెబుతున్నారు.

అస్థిపంజరాల సాక్ష్యం ఏం చెప్పింది?

న్యూయార్క్ విశ్వవిద్యాలయం, జార్జ్ మేసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అస్థిపంజరాలపై ఉండే గాయాలను విశ్లేషించారు. సాధారణంగా హింసను సూచించే పుర్రె గాయాలను, ప్రమాదాలను సూచించే ఇతర శరీర భాగాల గాయాలను వర్షపాతం, నీటి లభ్యత మార్పులతో పోల్చి చూశారు. ఆశ్చర్యకరంగా కేవలం 25 మందిలో (1.6 శాతం) మాత్రమే హింసాత్మక గాయాలు కనిపించాయి. మరో 77 మందిలో (5.1 శాతం) ప్రమాదవశాత్తూ జరిగిన గాయాలు ఉన్నాయి. పర్యావరణ అస్థిరతకు, ఈ హింసకు మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఆండీస్ పర్వత ప్రాంతంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే విపత్తుల వేళ కూడా ఇక్కడ హింస తక్కువగానే ఉందని తేలింది.

Advertisement

Also Read: ముంచుకొస్తున్న నిరుద్యోగ ముప్పు.. రెండేళ్లలో శాశ్వతంగా ఉపాధికి దూరం.. ఏఐ పరిశోధకుడి సంచలన హెచ్చరిక!

తీర ప్రాంత వనరులే ఆధారం

ఆ రోజుల్లో లాంబాయెక్యూలో తీరప్రాంత వనరులు (చేపలు, రొయ్యలు, పీతలు, కొబ్బరి, సముద్రపు నాచు) ప్రజలపై ఆహార ఒత్తిడిని తగ్గించి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. అలాగే రక్తపాతాన్ని నివారించేలా ఆ సమాజాలు తమను తాము తీర్చిదిద్దుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వాతావరణ సంక్షోభం ఎదురైనప్పుడు హింస లేదా సామాజిక పతనం తప్పనిసరి కాదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. అయితే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఎలా స్పందించాలనేది మన చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. గతాన్ని పరిశీలిస్తే వర్తమాన సంక్షోభాలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Also Read: డీమార్ట్‌లో మాంసాహారం, కూరగాయలు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ఎందుకు అమ్మరు? అసలు సీక్రెట్ తెలిస్తే షాకే!

Tags

Related News

వందే భారత్ జర్నీ సోషల్ మీడియా స్టేటస్‌గా ఎందుకు మారుతోంది? సైకాలజీ చెప్పే క్రేజీ సంగతి ఇదే!

స్వామివారి శ్వాసకు దీపం కదలికే సంకేతమా? వాడపల్లి ఆలయంలో అంతుచిక్కని రహస్యం!

మెట్రోకు పోటీగా PRTS.. హైదరాబాద్‌లో మరో కొత్త ట్రాన్స్‌ పోర్ట్ సిస్టమ్!

అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. ఈస్ట్ కోస్ట్, ఫలక్‌నుమా రైళ్ల కొత్త టైమింగ్స్ ఇవే!

దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. రైళ్లు రద్దు, విమాన సర్వీసులకు బ్రేక్!

ఆకాశంలో ఇక విమానాల సందడే.. మరో 1,000 విమానాలు వచ్చేస్తున్నాయ్!

ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా? ఈ 4 తప్పులు చేస్తే ప్రమాదమే

Big Stories

Advertisement
×