Sukanya Samriddhi Yojana: మార్కెట్ పరిస్థితులు సరిగా లేకపోవడం, బ్యాంకుల నుంచి వడ్డీలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలపై సామాన్యులు దృష్టి సారించారు. రోజు రోజుకూ ఖరీదవుతున్న పిల్లలు చదువు, వివాహాలు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పిల్లలు చిన్నప్పటి నుంచి పెట్టుబడి పెడితే పెద్దయ్యే సరికి నిధుల సమస్య ఉండదు. ఆ విధంగా సామాన్యులకు సహాయపడే వాటిలో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి.
కేంద్రం తీసుకొచ్చిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని బెస్ట్ స్కీమ్‌గా చెబుతారు. ప్రతి నెలా ఎంతైనా వేసుకోవచ్చు. రూ.250 నుంచి రూ. 10 వేలు వరకు ఎంతైనా జమ చేయవచ్చు. కేవలం 15 ఏళ్లు కడితే చాలు. 21 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా డబ్బులు చేతికి వస్తాయి. ప్రతీ నెల రూ. 250 కడితే చాలు.. 15 ఏళ్ల రూ. 45 వేలు కడితే చాలు. 21 ఏళ్లకు రూ.1.39 లక్ష వస్తుంది. అదే రూ. 1000 అనుకుంటే.. 15 ఏళ్లకు రూ.1.80 లక్షలు కడితే, దాదాపు రూ.5.55 లక్షలు వస్తుంది.
అదే రూ. 10 వేలు కడితే 15 ఏళ్లకు 18 లక్షలు అవుతుంది. 21 ఏళ్ల తర్వాత అది సొమ్మ కాస్త రూ. 55.46 లక్షలకు చేరుకోవచ్చు. ఇక్కడో గమనిక.. వడ్డీ రేట్లు ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తుంది. అప్పుడు పరిస్థితులను బట్టి పెరగవచ్చు. ఆ లెక్కన 21 సంవత్సరాల తర్వాత అందే నిధులు ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. దీనివల్ల డబ్బుకు సురక్షితం. పిల్లలకు ఉన్నత చదువులు పెళ్లిళ్లకు ఆ నిధులు కలిసి వస్తాయి. ఈ ఖాతా తెరవడానికి నియమాలు, డబ్బు విత్‌డ్రా చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పన్ను మినహాయింపులు ఉన్నాయి కూడా.
భారత పౌరసత్వం ఉండాలి. అమ్మాయి పుట్టినప్పటి నుండి 10 ఏళ్ల వచ్చే వరకు ఆమె తల్లిదండ్రులు లేకుంటే సంరక్షకులు ఈ ఖాతా తెరవవచ్చు. ఒక కుమార్తె పేరు మీద ఒకటి మాత్రమే తెరవచ్చు. ఒక కుటుంబంలో ప్రతి కుమార్తెకు గరిష్టంగా రెండు ఖాతాలు తెరవవచ్చు. ఖాతాను పోస్టాఫీసులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాలుగు ప్రైవేట్ బ్యాంకులైన HDFC, యాక్సిస్, ICICI, IDBI బ్యాంక్‌లలో ఓపెన్ చేయవచ్చు. దేశంలో ఎక్కడికైనా ఈ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. కూతురికి 18 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు నిర్వహిస్తారు.
18 ఏళ్లు నిండిన తర్వాత అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా ఆమె స్వయంగా ఖాతాను కంటిన్యూ చేసుకోవచ్చు. ఖాతా తెరిచేందుకు కుమార్తె జనన ధృవీకరణ పత్రం ఉండాలి. ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబర్, పాన్ కార్డ్ లేదా ఫారం-60 అవసరం ఉండాలి.ప్రస్తుతం సంవత్సరానికి 8.2 శాతంగా వడ్డీ ఉంది. వడ్డీని నెలవారీగా లెక్కించి ఆర్థిక సంవత్సరం చివరి వారి ఖాతాలో జమ చేస్తారు.
కూతురుకు 18 ఏళ్లు నిండినప్పుడు లేదా 10వ తరగతి పాసైనప్పుడు, తదుపరి చదువుల కోసం ఖాతాలో జమ చేసిన మొత్తం సొమ్ములో 50 శాతం తీసుకునే సదుపాయం కూడా ఉంది. అందుకు మీ కళాశాల లేదా ఆ సంస్థ ప్రవేశ పత్రం లేదా ఫీజు రసీదును సమర్పించాలి. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా సంవత్సరానికి ఒకసారి వాయిదాల పద్దతిలో వరుసగా 5 సంవత్సరాల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తర్వాత మూసి వేయకపోతే నష్టం లేదు. పోస్టాఫీస్ పొదుపు ఖాతాగా కంటిన్యూ చేయవచ్చు. మొదటి ఐదేళ్ల వరకు ఖాతాను మూసి వేయడం కుదరదు. ఆ తర్వాత రెండు సందర్భాలలో గడువుకు ముందే మూసి వేయడం సాధ్యమవుతుంది.
ALSO READ: డీమార్ట్‌లో మాంసాహారం, కూరగాయలు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ఎందుకు అమ్మరు? అసలు సీక్రెట్ తెలిస్తే షాకే!
పెళ్లికి ఒక నెల ముందు వరకు లేదా మూడు నెలల తర్వాత వరకు మీ ఖాతాను మూసి వేయవచ్చు. మీ కుమార్తెకు వివాహ తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. నోటరైజ్ చేయబడిన స్టాంప్ వేయబడిన డిక్లరేషన్, వయస్సు రుజువు పత్రాలు ఉండాలి. కుమార్తె దురదృష్టవశాత్తు మరణించినట్లయితే మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం ద్వారా ఖాతాను తక్షణమే మూసి వేయవచ్చు. జమ చేసిన డబ్బు, వడ్డీ సంరక్షకుడికి ఇవ్వబడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 C ప్రకారం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ట్యాక్స్ ఉండదు. వడ్డీ, 21 సంవత్సరాల తర్వాత అందుకున్న మొత్తం పూర్తిగా పన్ను రహితం.