E-Paper
Advertisement

బర్త్ డే విషెస్ కోసం రాత్రి 12 గంటలకు నిద్రలేవాల్సిన పనే లేదు..వాట్సాప్ మెసేజ్‌ షెడ్యూల్ చేయండిలా!

బర్త్ డే విషెస్ కోసం రాత్రి 12 గంటలకు నిద్రలేవాల్సిన పనే లేదు..వాట్సాప్ మెసేజ్‌ షెడ్యూల్ చేయండిలా!
Advertisement

Schedule WhatsApp message: ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ పుట్టినరోజు వస్తే.. అర్ధరాత్రి 12 గంటలకు కరెక్ట్‌గా మెసేజ్ పంపాలని చాలా మంది అలారం పెట్టుకుంటారు. కానీ ఆ టైమ్‌కి నిద్ర వస్తే.. విషెస్ చెప్పడం మిస్ అయిపోతుంటుంది, లేదా రాత్రి నిద్ర చెడిపోయి మరుసటి రోజు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టెన్షన్ లేకుండా ముందే మెసేజ్‌ని టైమ్ సెట్ చేసి ఉంచేస్తే.. కరెక్ట్ టైమ్‌కి ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్‌లలో వాట్సాప్ మెసేజ్‌లను షెడ్యూల్ చేసే సింపుల్ పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో వాట్సాప్ మెసేజ్ షెడ్యూల్ చేసే విధానం:

1. ఐఫోన్‌లో Apple Shortcuts ద్వారా షెడ్యూల్ :

ఐఫోన్ యూజర్లకు Shortcuts యాప్ ఒక సూపర్ హెల్ప్‌ఫుల్ టూల్. దీని ద్వారా మీకు కావాల్సిన తేదీ, టైమ్‌కి వాట్సాప్ మెసేజ్ పంపేలా ఆటోమేషన్ సెట్ చేయొచ్చు.
1. ఇందుకోసం ముందుగా మీ ఐఫోన్‌లో Shortcuts యాప్ ఓపెన్ చేసి, కింద ఉన్న Automation ట్యాబ్‌లోకి వెళ్లాలి.

Advertisement

2. తర్వాత కొత్త ఆటోమేషన్ క్రియేట్ చేయడానికి + లేదా New Automation ఆప్షన్ ఎంచుకుని, Time of Day సెలెక్ట్ చేయాలి.

3. మెసేజ్ వెళ్లాల్సిన సమయం ఉదాహరణకు అర్ధరాత్రి 12:00 AM సెట్ చేసి, మీకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని ఎంచుకుని Run Immediately ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ ఐఫోన్ iOS వెర్షన్, సెట్టింగ్స్‌ని బట్టి కొన్ని ప్రాంప్ట్స్ కనిపిస్తాయి.

Advertisement

4. నెక్స్ట్ స్టెప్‌లో New Blank Automation తీసుకుని, Add Action ద్వారా Send Message లేదా WhatsApp యాక్షన్ సెలక్ట్ చేసుకుని, పంపాలనుకుంటున్న మెసేజ్ టెక్స్ట్, రిసీవర్‌ని సెట్ చేయాలి.

4. పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఆటోమేషన్ పొరపాటున మరో సారి రన్ అవ్వకుండా ఆ రోజు అయ్యాక దాన్ని డిసేబుల్ చేయడం లేదా డిలీట్ చేయడం మంచిది.

2. ఆండ్రాయిడ్‌లో ఆటోమేషన్ ,షెడ్యూలింగ్:

ఆండ్రాయిడ్ ఫోన్లలో యూజర్లు వాడే OS వెర్షన్, యాప్ పర్మిషన్లను బట్టి వివిధ పద్ధతులు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఫోన్లలో సిస్టమ్ ఆటోమేషన్ లేదా రిమైండర్, షెడ్యూలింగ్ ఫీచర్లు ఉపయోగపడతాయి. మరి కొన్ని చోట్ల థర్డ్-పార్టీ షెడ్యూలర్ యాప్స్ లేదా మెసేజింగ్ ఆటో మేషన్ టూల్స్ వాడుతుంటారు.

ఆండ్రాయిడ్‌లో ఏదైనా థర్డ్-పార్టీ షెడ్యూలింగ్ యాప్ లేదా ఆటోమేషన్ టూల్ వాడేటప్పుడు యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ పర్మిషన్లు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు లేదా బ్యాటరీ సేవర్ ఆన్‌లో ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ చేసిన టైమ్‌కి ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా థర్డ్-పార్టీ యాప్స్ వాడేటప్పుడు ప్రైవసీ, యాప్ రేటింగ్స్, పర్మిషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అనవసరమైన యాక్సెస్ అడిగే యాప్స్‌కి దూరంగా ఉండాలి.

3. షెడ్యూల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన టిప్స్:

మెసేజ్ షెడ్యూల్ చేయడం ఎంత ఈజీనో, అది కరెక్ట్‌గా వెళ్లిందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

టైమ్ , తేదీ క్రాస్-చెక్: AM/PM తేడా వల్ల ఉదయం 12 గంటలకు బదులు మధ్యాహ్నం లేదా మరో తేదీలో సెట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.కన్ఫర్మ్ చేసే ముందు ఒక సారి చెక్ చేయండి.

నెట్‌వర్క్,ఫోన్ స్టేటస్: షెడ్యూల్ చేసిన టైమ్‌లో.. ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా, మొబైల్ డేటా లేదా Wi-Fi యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి.

రిపీట్ ఆప్షన్ జాగ్రత్త: బర్త్‌డే మెసేజ్‌ని పొరపాటున ప్రతిరోజూ లేదా ప్రతి నెలా రిపీట్ అయ్యేలా సెట్ చేస్తే.. ఇబ్బంది అవుతుంది. ఒక్క సారి మాత్రమే వెళ్లేలా లేదా తర్వాత ఆఫ్ చేసేలా సెట్ చేసుకోండి.

Also Read: భారీ బేస్,సూపర్ సౌండ్..సినిమా లవర్స్ కోసం టాప్ 5.1 హోమ్ థియేటర్లు!

4. ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్:

ఐఫోన్‌లో బిల్ట్-ఇన్ Shortcuts యాప్ ఉండటం వల్ల సిస్టమ్ స్థాయిలోనే ఆటోమేషన్ సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో మాత్రం డివైజ్ మోడల్, సాఫ్ట్‌వేర్ వర్షన్, మీరు ఎంచుకునే.. ఆటోమేషన్ లేదా షెడ్యూలింగ్ పద్ధతిని బట్టి సెటప్ కొద్దిగా మారుతుంది. ఏ ఫోన్ వాడినా పర్మిషన్లు, బ్యాటరీ సేవర్ సెట్టింగ్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ.. సరైన స్థితిలో ఉండటం ముఖ్యం.

టెక్నాలజీ మన పనిని ఈజీ చేయడానికే కదా. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి రాత్రంతా మేల్కొనే బదులు, ఇలా ముందుగానే.. స్మార్ట్‌గా షెడ్యూల్ చేసి హాయిగా నిద్రపోవచ్చు. ముఖ్యమైన వ్యక్తులకు టైమ్‌కి విషెస్ వెళ్లిపోతే ఆ ఆనందమే వేరు.

Related News

సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం SIM Swap.. ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ జీరో అవుతుంది! జాగ్రత్త పడండిలా..

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!

వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!

పార్టీ వైబ్స్‌కి కొత్త జోష్..ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్

Big Stories

Advertisement
×