E-Paper
Advertisement

ఏంటీ.. అగ్నిపర్వత విస్ఫోటనాలు.. భూమిని కూల్‌గా ఉంచుతున్నాయా? ఎలాగో తెలిస్తే థ్రిల్ పక్కా!

ఏంటీ.. అగ్నిపర్వత విస్ఫోటనాలు.. భూమిని కూల్‌గా ఉంచుతున్నాయా? ఎలాగో తెలిస్తే థ్రిల్ పక్కా!
Advertisement

Volcanic Eruptions: అగ్నిపర్వతం పేలిందంటే వెంటనే గుర్తొచ్చేది మంటలు, వేడి లావా, విధ్వంసం. కానీ చరిత్రలో కొన్ని అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాలు భూమిని వేడెక్కించడానికి బదులుగా తాత్కాలికంగా చల్లబరిచాయి. భూమిపై ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించాయి. భారీ విస్ఫోటనాల సమయంలో పైకి ఎగసిపడే వాయువులు.. స్ట్రాటోస్పియర్‌లోకి చేరి సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల ఈ మార్పు జరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం తెలియజేస్తున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

 సల్ఫర్ డయాక్సైడ్ ప్రభావం

సాధారణంగా భారీ అగ్నిపర్వతాలు పేలినప్పుడు వాయువులు, సూక్ష్మ కణాలు దాదాపు 20 కి.మీ ఎత్తులోని స్ట్రాటోస్పియర్‌లోకి దూసుకెళ్తాయి. వాటిలో సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది అక్కడి నీటి ఆవిరితో కలిసి ‘సల్ఫేట్ ఏరోసాల్స్’ అనే సన్నని కణాలుగా మారుతుందని  శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎత్తైన గాలుల ద్వారా ఇవి ప్రపంచమంతా వ్యాపించి.. సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించే పొరలా ఏర్పడతాయని స్పష్టం చేస్తున్నారు.

1991 నాటి అనుభవం..

Advertisement

ఫలితంగా భూమి ఉపరితలానికి చేరే వేడి తగ్గి, ఉష్ణోగ్రతలు పడిపోతాయి. 1991లో ఫిలిప్పీన్స్‌లోని మౌంట్ పినాటుబో పేలినప్పుడు సుమారు 20 మిలియన్ టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ పైకి వెళ్లింది. దాంతో తర్వాతి ఏడాదిలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత సుమారు 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గినట్లుగా తేలింది. అతి తక్కువ సమయంలో ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే మార్పులకు అగ్నిపర్వతాలే అతిపెద్ద కారణమని రట్జర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ అలన్ రోబోక్ సైతం పేర్కొన్నారు.

అన్ని విస్ఫోటనాలు ఒకేలా ఉండవ్..

అయితే ప్రతి అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ ఉష్ణోగ్రతలను మార్చలేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అన్ని విస్ఫోటనాలకు వాయువులను స్ట్రాటోస్పియర్ దాకా చేర్చేంత శక్తి ఉండదని స్పష్టం చేస్తున్నారు. కొన్ని అగ్నిపర్వత పేలుళ్లు కింది స్థాయి వాతావరణంలోనే ఆగిపోయి మేఘాల్లోని వర్షపు నీటితో కలిసిపోతాయని చెబుతున్నారు. ఫలితంగా ఇవి నీటిని బరువెక్కించి.. వేగంగా భూమికి చేరేలా ప్రేరేపిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో ప్రపంచమంతా కాకపోయిన నిర్దిష్ట పరిధి మేరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంటున్నారు. 1815లో ఇండోనేషియాలోని మౌంట్ తంబోరా పేలిన తర్వాత యూరప్, ఉత్తర అమెరికాలో చలి తీవ్రత పెరిగింది.

విస్ఫోటన ప్రభావం ఎన్నాళ్లు వరకు..

Advertisement

అయితే విస్ఫోటనం వల్ల వచ్చే చల్లదనం శాశ్వతం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏడాది నుంచి మూడేళ్ల వరకు మాత్రమే దీని ప్రభావం భూ వాతావరణంపై ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ తర్వాత విస్ఫోటనం కణాలు కిందికి చేరి సాధారణ వాతావరణం నెలకొంటుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల రుతుపవనాలు బలహీనపడటం, వర్షపాతం కొద్దిగా తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని అభిప్రాయపడుతున్నారు. గ్రీన్‌లాండ్, అంటార్కిటికా మంచు పొరల్లోని సల్ఫేట్ ఆనవాళ్లు, ఉపగ్రహ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ మార్పులను గుర్తించారు.

Also Read: పెళ్లి, సాఫ్ట్ వేర్ జాబ్ వద్దు.. డెలివరీ బాయ్ పనే ముద్దు.. ‘జెన్ జీ’ యువత నయా ట్రెండ్!

జియో ఇంజినీరింగ్‌పై హెచ్చరికలు

మరోవైపు అగ్నిపర్వతాల తరహాలోనే కృత్రిమంగా స్ట్రాటోస్పియర్‌లోకి ఏరోసాల్స్ పంపి భూతాపాన్ని తగ్గించవచ్చా? అనే చర్చలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అలా చేస్తే వర్షపాతంలో మార్పులు, ఓజోన్ పొరపై ప్రభావం వంటి ముప్పులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించకుండా.. ఇదొక ప్రత్యామ్నాయం కాలేదని డాక్టర్ రోబోక్ స్పష్టం చేశారు. మెుత్తం మీద ఒక్క అగ్నిపర్వత విస్ఫోటనం భూ ఉష్ణోగ్రతలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

Also Read: బంగారం ధరలు ఢమాల్.. రూ.లక్షకు పడిపోయే ఛాన్స్.. మరి ఇప్పుడే కొనాలా? ఇంకాస్త ఆగాలా?

Tags

Related News

5G ఫోన్ వాడుతున్నా ఇంకా 4G సిగ్నలే వస్తోందా? ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. యాపిల్, శాంసంగ్ ఫోన్లపై రూ.46,000 వరకు తగ్గింపు.. బ్లాక్ ఫ్రైడే సేల్ టాప్-10 డీల్స్ ఇవే!

యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన మైక్రోమ్యాక్స్, కార్బన్ రీ-ఎంట్రీ.. చైనా బ్రాండ్ల ఖాళీని భర్తీ చేయగలవా?

ఓపెన్‌ఏఐ సంచలన ప్రకటన.. ఏడాది పాటు ‘చాట్‌జీపీటీ ప్లస్’ ఫ్రీ.. రూ.23,998 విలువైన సేవలు ఉచితం!

Big Stories

Advertisement
×