E-Paper
Advertisement

డీమార్ట్‌లో మాంసాహారం, కూరగాయలు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ఎందుకు అమ్మరు? అసలు సీక్రెట్ తెలిస్తే షాకే!

డీమార్ట్‌లో మాంసాహారం, కూరగాయలు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ఎందుకు అమ్మరు? అసలు సీక్రెట్ తెలిస్తే షాకే!
Advertisement

DMart Business Secret: తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను అందిస్తూ సామాన్యుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది డీమార్ట్. పండుగ సీజన్లు, స్పెషల్ ఆఫర్లతో సంబంధం పెద్ద ఎత్తున ప్రజలు.. డీమార్ట్ కు వెళ్లి తమ నెలవారీ సరుకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. సాధారణంగా ఏ వ్యాపారంలోనైనా కస్టమర్లు ఎక్కువ వస్తే.. వారికి అందించే ప్రొడక్ట్స్ ను సైతం పెంచి అధిక లాభాలను అర్జించాలని యాజమాన్యం చూస్తుంది. కానీ డీమార్ట్ విషయంలో అలా లేదు. డిమాండ్ ఉన్నప్పటికీ మాంసాహారం, కూరగాయాలు, ఆకుకూరలు, ఔషదాలు వంటి వాటికి డీమార్ట్ దూరంగా ఉంటోంది. దీనికి గల కారణాలేంటి? దీని వెనుక వ్యూహం ఏమైనా ఉందా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

మాంసాహారం ఎందుకు ఉండదు?

దేశంలోని ఏ డీమార్ట్ స్టోర్ ను తీసుకున్న అక్కడ తాజా మాంసాహారం ఏ మాత్రం కనిపించదు. కొన్ని చోట్ల ఫ్రోజెన్ చికెన్, సీఫుడ్ లేదా గుడ్లు పరిమిత స్థాయిలో కనిపించినా.. తాజా మటన్, చికెన్, చేపలను మాత్రం డీమార్ట్ విక్రయించదు. అయితే దీని వెనుక పెద్దగా వ్యూహం ఏమీ లేదు. వీటిని నిల్వ చేయడం, శుభ్రత పాటించడం, సరఫరా ప్రక్రియలో ఉండే లాజిస్టిక్ సవాళ్లే దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

ఆకుకూరలు, కూరగాయల సంగతేంటి?

Advertisement

డీమార్ట్‌లో పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర వంటి త్వరగా పాడైపోయే ఆకుకూరలు అస్సలు కనిపించవు. అలాగే కొన్ని రకాల పచ్చి కూరగాయలను సైతం డీమార్ట్ విక్రయించకపోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. దీని వెనుక కూడా బలమైన కారణాలే ఉన్నాయి. సాధారణంగా ఆకుకూరలు చాలా త్వరగా వాడిపోయి, పాడైపోతుంటాయి. అలాగే కూరగాయాలు సైతం సమయం గడుస్తున్న కొద్ది కుళ్లిపోవడం, పోషక విలువలను కోల్పోవడం వంటి జరుగుతుంటాయి. కాబట్టి వీటిని పెద్ద ఎత్తున నిల్వ చేయడం, ప్రతిరోజూ ఒకే నాణ్యతతో తాజాగా ఉంచడం కష్టమైన పని కాబట్టి డీమార్ట్ వీటి జోలికి వెళ్లడంలేదు.

మరి ఔషధాల మాటేంటి?

డీమార్ట్ స్టోర్లలో మందులు లేదా ఔషధాలకు సైతం చోటు లేదు. విక్స్ వేపోరబ్, టైగర్ బామ్ వంటి సాధారణ మందులు దొరికినప్పుటికీ.. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు అవసరమైన మందులు అక్కడ లభించవు. దీనికి కారణం కఠినమైన డ్రగ్ లైసెన్సింగ్ నిబంధనలు, నిపుణులైన ఫార్మసిస్టుల అసవరం, స్టాక్ నిర్వహణలోని సంక్లిష్టత అని చెప్పవచ్చు. అయితే డీమార్ట్ మాతృసంస్థ అయిన అవెన్యూ సూపర్ మార్ట్స్.. ‘రిఫ్లెక్ట్ హెల్త్ కేర్ అండ్ రిటైల్’ అనే అనుబంధ సంస్థ ద్వారా ముంబైలో కొన్ని ఫార్మసీ స్టోర్లను నడుపుతోంది.

Advertisement

Also Read: స్కూటీ ముందు స్టైలిష్ ఫోజు.. బుడ్డోడి భవిష్యత్తునే మార్చేసిందోచ్.. షోరూమ్ ఓనర్ బంపర్ గిఫ్ట్!

ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలకు నో

మరోవైపు డీమార్ట్ లో పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులకు సైతం చోటు లేదు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు తదితర వస్తువులను డీమార్ట్ విక్రయించదు. రాధాకిషన్ దమానీ స్థాపించిన డీమార్ట్ ప్రధాన ఉద్దేశం రోజువారీ గృహ అవసరాలను తీర్చడమే. అందుకే డీమార్ట్‌కు వెళ్లినప్పుడు మాంసాహారం (మటన్, చికెన్, చేపలు), మద్యం, కొన్ని రకాల తాజా పాల ఉత్పత్తుల కోసం అక్కడ వెతికి సమయం వృథా చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అవి అక్కడ లభించవని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

Also Read: అసంతృప్తుల వేళ అసమ్మతి గోల! కోమటిరెడ్డి వ్యూహమేమిటీ..? పాత, కొత్త కలయికల గ్యాప్‌ను వాడుకుంటున్నారా? పార్టీలో అతనికి మద్దతెలా ఉంది?

Tags

Related News

పెళ్లి కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ 7 సందర్భాల్లో మాత్రం మీకే నష్టం

పసిడి ధరలకు బ్రేక్.. సామాన్యుడికి సరైన అవకాశం! ధరలు ఎలా ఉన్నాయి?

ఉద్యోగం మానేసి వ్యాపారం చేయండి నేన్నున్నా.. టాలెంటెడ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న కంపెనీ బాస్

మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ ప్రారంభం.. పెట్టుబడుదారులకు పండగే, ఇష్యూ ప్రైస్‌తోపాటు జీఎంపీ

ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే

బంగారం ధరలు భారీ పతనం.. ఇప్పుడు కొనచ్చా?

పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?

Big Stories

Advertisement
×