BigTV English

Varahi Vehicle : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘వారాహి’కి రిజిస్ట్రేష‌న్ పూర్తి.. లైన్ క్లియ‌ర్ చేసిన తెలంగాణ‌

Varahi Vehicle : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘వారాహి’కి రిజిస్ట్రేష‌న్ పూర్తి.. లైన్ క్లియ‌ర్ చేసిన తెలంగాణ‌

Varahi Vehicle : రాబోతున్న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో జోరు పెంచ‌టానికి జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా ఆయ‌న వారాహి అనే ప్ర‌చార‌ వాహ‌నాన్ని సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల దానికి సంబంధించిన టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. అయితే ఆ వారాహి వాహ‌నంపై ఏపీ అధికార పార్టీ వైసీపీ విమ‌ర్శ‌లు చేసింది. వాహ‌నానికి ఆర్మీకి ఉప‌యోగించే ఆలివ్ గ్రీన్ క‌ల‌ర్ వేయ‌టంపై వారు అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. వారాహికి రిజిస్ట్రేష‌న్ చేయ‌ర‌ని కూడా వారు అన్నారు. అయితే సోమ‌వారం రోజున వారాహి వాహ‌నానికి సంబంధించి రిజిస్ట్రేష‌న్ ప‌నులు తెలంగాణ‌లో పూర్త‌య్యాయి.


నిజానికి వెహిక‌ల్స్‌కు ఉప‌యోగించే క‌ల‌ర్స్‌కు సంబంధించి కోడ్స్ ఉంటాయి. భార‌త ఆర్మీకి ఉప‌యోగించే క‌ల‌ర్ కోడ్ 7B8165. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి వాహనానికి ఉప‌యోగించిన క‌ల‌ర్ కోడ్ 445c44 అని స‌మాచారం. నిబంధ‌ల‌న‌కు లోబడి ఉండ‌టంతో రిజిస్ట్రేష‌న్ చేయ‌టానికి ఎలాంటి అభ్యంత‌రాన్ని తెలంగాణ ర‌వాణా శాఖ వ్య‌క్తం చేయ‌కుండా రిజిస్ట్రేష‌న్‌ను పూర్తి చేసింది. మ‌రిప్పుడు వారాహి రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌హ‌రంపై వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×